News January 1, 2025

నేడు దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నేడు బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ఆయన అమ్మవారి సన్నిధికి చేరుకుంటారని తెలుస్తోంది. అనంతరం నగర టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలను కలిసి మాట్లాడనున్నారు. కాగా.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తన కోసం బొకేలు, శాలువాలు, కేకులు తీసుకురావొద్దని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు.

Similar News

News November 28, 2025

స్విగ్గీ, జొమాటో, జెప్టో గోడౌన్లలో ఇదీ పరిస్థితి

image

TG: హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థల గోడౌన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. స్విగ్గీ, జెప్టో, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు చెందిన 75 గోడౌన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో ఎక్స్‌పైర్డ్, మిస్ బ్రాండెడ్ వస్తువులను సీజ్ చేశారు. కుళ్లిన ఫ్రూట్స్, కూరగాయలను గుర్తించారు. పలు వస్తువుల శాంపిల్స్ సేకరించారు. ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశారు.

News November 28, 2025

పృథ్వీరాజ్ ఎదగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు: తల్లి మల్లిక

image

పృథ్వీరాజ్ కెరీర్‌ను నాశనం చేసేలా సైబర్ అటాక్ జరుగుతోందని తల్లి మల్లిక ఆరోపించారు. అతను ఎదగడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, సోషల్ మీడియాలో ఘోరంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఈ పనులను ఆపేంత వరకు తాను పోరాటం చేస్తూనే ఉంటానని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇటీవల పృథ్వీరాజ్ నటించిన విలయత్ బుద్ధ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. తెలుగులో వారణాసి చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

News November 28, 2025

‘రబీలో యూరియా కొరత ఉండకూడదు’

image

AP: ఖరీఫ్‌లో ఎదురైన యూరియా సమస్యలు.. ప్రస్తుత రబీ సీజన్‌లో తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. గ్రోమోర్ కేంద్రాల్లో యూరియా కొరతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.91 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని, పోర్టుల్లో మరో 1.35 లక్షల టన్నులు ఉందని.. దీన్ని అన్ని జిల్లాలకు అవసరం మేరకు తరిలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.