News January 10, 2025

నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరులో పర్యటించనున్నారు. జాతీయ రియల్ ఎస్టేట్ మండలి ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగే ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో నిర్మాణ రంగం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సీఎం ప్రసంగించనున్నారు. ఉదయం 11గంటలకు చంద్రబాబు గుంటూరు వస్తారని కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Similar News

News January 30, 2026

కారు ఇంటి వద్ద ఉన్నా టోల్.. ఇదే కారణం!

image

దేశవ్యాప్తంగా FASTag వ్యవస్థలో లోపాలు గుర్తించినట్లు LSలో ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. ‘2025లో 17.7లక్షల వాహనాలకు తప్పుగా టోల్ వసూలైంది. ఇంటి వద్ద ఉన్న కార్లకూ ఛార్జీ పడినట్లు మెసేజ్‌లు వెళ్లాయి. టోల్ ప్లాజాల్లో ఆటోమేటిక్ సిస్టమ్ పనిచేయనప్పుడు మాన్యువల్ ఎంట్రీ కారణంగా ఈ తప్పిదాలు జరిగాయి. 17.7లక్షల కేసులకు సంబంధించి NHAI టోల్ డబ్బులు తిరిగి చెల్లించింది’ అని వివరించారు.

News January 30, 2026

పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

image

US-ఇరాన్‌ వైరం చమురు మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. లండన్ మార్కెట్‌లో బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 2.4% పెరిగి $70.06కు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కూడా 2.6% పెరిగి బ్యారెల్ $64.82కి చేరింది. US దాడి చేస్తే ఇరాన్ ఆయిల్ ఉత్పత్తి రోజుకు 3M బ్యారెల్స్ తగ్గనుందని నిపుణుల అంచనా. హార్ముజ్ జలసంధి రవాణాపై ప్రభావం పడొచ్చు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

News January 30, 2026

భారీగా పెరుగుతున్న గిగ్ కార్మికులు

image

దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. వీరి సంఖ్య 2021లో 77 లక్షలు కాగా 2025కి 1.2 కోట్లకు చేరిందని సోషియో ఎకనమిక్ సర్వే-2026 పేర్కొంది. దేశ శ్రామికశక్తిలో ఇది 2%గా ఉంది. 2030 నాటికి 6.7%కి చేరుకుంటుందని అంచనా వేసింది. 52L మంది ఈ కామర్స్, లాజిస్టిక్స్ రంగాలలో పనిచేస్తున్నారు. వీరిలో 40% మంది వేతనం ₹15000 కన్నా తక్కువే. పనిగంటలూ అధికమే. గిగ్ వర్కర్ల పెరుగుదలతో UPI పేమెంట్లూ పెరుగుతున్నాయి.