News January 30, 2025

సీఎం చంద్రబాబు కొవ్వూరు పర్యటన రద్దు

image

AP: సీఎం చంద్రబాబు కొవ్వూరు పర్యటన రద్దు అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ టూర్ రద్దైనట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ నెల 1న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో సీఎం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు ఇదే కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లాకు మార్చినట్లు తెలుస్తోంది.

Similar News

News February 8, 2026

అరటిలో దుంపకుళ్లు తెగులు నివారణ ఎలా?

image

అరటి పంటలో దుంపకుళ్లు తెగులును నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఆశిస్తే తోటలకు సరిపడా నీరివ్వాలి. తెగులు సోకిన మొక్కలను దుంపలతో సహా తీసేసి తోట బయట చిన్న చిన్న ముక్కలుగా చేసి తగలబెట్టాలి. మొక్కల మొదళ్ల దగ్గర మట్టి బాగా తడిచేలా 25 గ్రాముల బ్లీచింగ్ పౌడర్‌ను లీటరు నీటికి కలిపి తడపాలి. పశువుల ఎరువుతో వృద్ధి చేసిన సూడోమోనాస్‌ను మొక్కల మొదళ్ల దగ్గర వేస్తే తెగులు చాలా వరకు తగ్గుతుంది.

News February 8, 2026

APPLY NOW: HLL లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌లో 39 పోస్టులు

image

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 39 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BSc, BTech, CA, MSc, MBA/PGDM, MCA, MHA, MPH, BPMT, PGDMLT, MLT అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.20,000-రూ.2,20,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.lifecarehll.com

News February 8, 2026

మమ్ముట్టి పేరు వెనుక ఆసక్తికర కథ

image

మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ మెగాస్టార్ మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్. కాలేజీ రోజుల్లో తన పేరు పాతగా అనిపించడంతో ‘ఒమర్ షరీఫ్’గా పరిచయం చేసుకునేవారు. అయితే ఒకసారి పాకెట్ నుంచి ఐడీ కార్డు పడిపోవడంతో ఓ స్నేహితుడు మహ్మద్ కుట్టిని ‘మమ్ముట్టి’గా పిలిచాడు. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అంతా ఆ పేరుతోనే పిలిచేవారు. అదే చివరికి స్క్రీన్ నేమ్‌గా మారింది. తాజాగా ఆయన పద్మభూషణ్ అందుకున్నారు.