News October 10, 2025

నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం (M) ఈదగాలిలో నందగోకులం లైఫ్ స్కూలును ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి స్టూడెంట్స్‌తో ముచ్చటిస్తారు. ఆ తర్వాత సమీపంలోని గోశాలకు వెళ్లి నంది పవర్ ట్రెడ్ మిల్, నందగోకులం సేవ్ ది బుల్ ప్రాజెక్టులతో పాటు విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు.

Similar News

News October 10, 2025

రుషికొండ ప్యాలెస్.. నెలకు రూ.25 లక్షల ఖర్చు!

image

AP: విశాఖలోని రుషికొండ ప్యాలెస్‌ నుంచి ఆదాయం వచ్చేలా దాన్ని ఎలా వాడుకోవాలనే అంశంపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అది నిరుపయోగంగా ఉండటం వల్ల నెలకు రూ.25 లక్షలు విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టాల్సి వస్తోందని మంత్రులు పయ్యావుల, DBV స్వామి, దుర్గేశ్ అన్నారు. కాగా వైసీపీ హయాంలో దీన్ని రూ.409 కోట్లతో నిర్మించారు.

News October 10, 2025

రూ.1.20 లక్షల జీతం.. 13న ఇంటర్వ్యూలు

image

AP: మైనారిటీ యువతకు ఖతర్‌లో ఉద్యోగాలు కల్పించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. దోహాలో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాల కోసం ఈనెల 12లోగా http://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 13న విజయవాడలో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. 21-40 ఏళ్ల వయసుండి B.Sc/GNM నర్సింగ్ విద్యార్హత, అనుభవం ఉండాలన్నారు. ఎంపికైన వారు IT కటింగ్స్ లేకుండా నెలకు రూ.1.20 లక్షలు పొందవచ్చని తెలిపారు.

News October 10, 2025

రేపు ధనధాన్య కృషి యోజన ప్రారంభం

image

దేశంలో వ్యవసాయ రంగ ఉత్పాదకతను మరింత పెంచేందుకు కేంద్రం ప్రకటించిన ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. జాతీయ సగటుకంటే తక్కువగా పంట ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఈ పథకం కింద ఎంపికచేశారు. ఈ జిల్లాల్లో సాగునీటి వ్యవస్థ, పంట నిల్వ సామర్థ్యం, రుణసదుపాయం, పంటసాగులో వైవిధ్యం పెంచడానికి కేంద్రం చేయూతనందిస్తుంది. ఏటా రూ.24 వేల కోట్ల వ్యయంతో ఆరేళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేస్తారు.