News September 15, 2024
రేపు గుజరాత్కు సీఎం చంద్రబాబు.. PMతో భేటీకి ఛాన్స్?

AP: సీఎం చంద్రబాబు రేపు గుజరాత్ రాజధాని గాంధీనగర్లో పర్యటించనున్నారు. 4వ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో పాల్గొంటారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న అవకాశాలపై మాట్లాడటంతోపాటు ఓ నివేదికను విడుదల చేయనున్నారు. ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా PMతో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వర్షాలు, వరదల నష్టాన్ని ఆయనకు వివరిస్తారని సమాచారం.
Similar News
News November 21, 2025
రిజర్వేషన్ల ఖరారుకు మంత్రివర్గం ఆమోదం.. రేపే జీవో

TG: గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ రేపు GO ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన <<18332519>>నివేదికను<<>> రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రులకు ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. దీంతో రిజర్వేషన్లపై రేపు జీవో రానుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.
News November 21, 2025
సీఎస్ పదవీకాలం పొడిగింపు

ఏపీ సీఎస్ విజయానంద్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుండగా 3 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2026 ఫిబ్రవరి వరకు విజయానంద్ సీఎస్గా కొనసాగనున్నారు. అనంతరం సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు. అదే ఏడాది మేతో ఆయన పదవీకాలం కూడా ముగియనుంది.
News November 21, 2025
అపార్ట్మెంట్ల సముదాయాలకు వీధిపోటు, వీధి శూల ప్రభావం ఉంటుందా?

గేటెడ్ కమ్యూనిటీలు లేదా అపార్ట్మెంట్లలో వీధిపోటు, వీధి శూల ప్రభావం తక్కువగా ఉంటుందని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు అంటున్నారు. ‘గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీగా ఉండి, కాంపౌండ్ వాల్ ఉండటం వలన ఇతరుల దృష్టి తక్కువగా పడుతుంది. భవన నిర్మాణం, భద్రతా ప్రణాళికలు వీటికి రక్షణగా నిలుస్తాయి. ప్లాట్లను సమూహంగా నిర్మించడం వలన వచ్చే భద్రత వాటి ప్రతికూల ప్రభావాలను చాలా వరకు తగ్గిస్తుంది’ అని వివరించారు. <<-se>>#Vasthu<<>>


