News August 9, 2024

రేపు హైదరాబాద్‌కు CM చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబునాయుడు రేపు సాయంత్రం 4గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతారు. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బాబు HYDలో పర్యటించడం ఇది రెండోసారి.

Similar News

News December 26, 2025

ఆదోనికి కిమ్స్ టెండర్ వేయలేదా?

image

AP: PPP విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు ప్రభుత్వం తొలి విడత టెండర్లు పిలవగా 4 కాలేజీల్లో ఆదోనికి కిమ్స్ బిడ్ దాఖలు చేసిందని వార్తలొచ్చాయి. అయితే తాము అసలు టెండర్‌లో పాల్గొనలేదని కిమ్స్ యాజమాన్యం పేర్కొన్నట్లు సమాచారం. తాము టెండర్ వేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, అసలు ఆ ప్రక్రియలో పాల్గొనాలని తాము అనుకోలేదని చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

News December 26, 2025

గొంతులు కోస్తున్న చైనా మాంజా.. జాగ్రత్త!

image

సంక్రాంతి సమీపిస్తుండటంతో ఆకాశంలో పతంగులు సందడి చేస్తున్నాయి. కానీ ఆ సరదా వెనుక ప్రమాదం కూడా పొంచి ఉంది. అదే చైనా మాంజా. దీనిపై నిషేధం ఉన్నా ఇప్పటికీ యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా HYD శివారు కీసరలో చైనా మాంజా మెడకు తగిలి జశ్వంత్ అనే యువకుడికి తీవ్ర గాయమైంది. బైక్‌పై వెళ్తున్న అతడి మెడను మాంజా కోసేయడంతో ఏకంగా 19 కుట్లు పడ్డాయి. రోడ్లపై ప్రయాణించేటప్పుడు మీరూ జాగ్రత్త వహించండి.

News December 26, 2025

కోహ్లీకి POTM.. ప్రైజ్ మనీ తెలిస్తే అవాక్కే!

image

విజయ్ హజారే ట్రోఫీలో GJతో మ్యాచులో ఢిల్లీ 7రన్స్ తేడాతో గెలిచింది. 77రన్స్ చేసిన ఆ టీమ్ ప్లేయర్ కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(POTM) అవార్డు వరించింది. దీంతో ఆయనకు రూ.10,000 చెక్ ఇవ్వడం గమనార్హం. ఇంటర్నేషనల్ మ్యాచుల్లో ప్రైజ్ మనీ రూ.లక్షల్లో ఉండగా ‘లిస్ట్-ఎ’ల్లో ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఎంతపెద్ద ఆటగాడికైనా అంతే అమౌంట్ అని, కోహ్లీ రూ.10వేల చెక్ తీసుకోవడం ఫన్నీగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.