News April 1, 2025
నేడు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలంలోని కొత్తగొల్లపాలెంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం దివ్యాంగులకు స్కూటీలు అందజేస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. బాపట్లలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
Similar News
News April 4, 2025
ఇంటిమేట్ సీన్‌లో ఓ నటుడు హద్దు మీరాడు: హీరోయిన్ అనుప్రియ

తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను హీరోయిన్ అనుప్రియా గోయెంకా పంచుకున్నారు. ఓ ముద్దు సీన్‌లో తాను ఇబ్బంది పడ్డట్లు చెప్పారు. ‘ఓ సినిమాలో కిస్సింగ్ సీన్ చేస్తున్నా. ఆ సమయంలో ఓ నటుడు నా నడుము పట్టుకోవాల్సి ఉంది. స్క్రిప్టులోనూ అదే ఉంది. కానీ అతడు మరో చోట అసభ్యకరంగా తాకడంతో ఇబ్బంది పడ్డా. వెంటనే అతడిని ప్రశ్నించలేకపోయా. కానీ ఆ తర్వాతి టేక్‌లో మాత్రం అలా చేయొద్దని హెచ్చరించా’ అంటూ చెప్పుకొచ్చారు.
News April 4, 2025
కుంభమేళాతో రూ.2.80 లక్షల కోట్ల బిజినెస్

ప్రయాగ్ రాజ్‌లో జరిగిన కుంభమేళాతో దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి ప్రోత్సాహం లభించినట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక తెలిపింది. ఈ మేళా వల్ల రూ.2.8 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు జరిగినట్లు వెల్లడించింది. కొనుగోళ్ల రూపంలో రూ.90,000 కోట్లు, ఎయిర్‌లైన్స్, హోటళ్లు తదితర రంగాల ద్వారా రూ.80,000 కోట్ల వ్యాపారం జరిగినట్లు పేర్కొంది. రోజూవారీ అవసరాల కోసం రూ.1.1 లక్షల కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిపింది.
News April 4, 2025
ఈ నెల 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

AP: ఈ నెల 7 నుంచి రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో NTR వైద్య సేవలను నిలిపేస్తున్నట్లు ఏపీ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం నుంచి రూ.3,500 కోట్ల బకాయిలు రావాలని, దీంతో ఆస్పత్రుల నిర్వహణ చేయలేకపోతున్నామని వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ బకాయిలు కూడా ఇవ్వలేదని, చేసిన అప్పులు తీర్చలేకపోతున్నామని పేర్కొంది. ప్రభుత్వం స్పందించి రూ.1,500 కోట్లు మంజూరు చేయాలని కోరింది.