News February 5, 2025

23న శ్రీశైలానికి సీఎం చంద్రబాబు

image

AP: శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈ నెల 19- మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా CM చంద్రబాబు 23న స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు దేవస్థాన యంత్రాంగం కృషి చేస్తోంది. పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు, మహిళలు బట్టలు మార్చుకునే గదులకు మరమ్మతులు చేస్తున్నారు. అటు శివ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

Similar News

News October 29, 2025

ఆ రూ.20 లక్షలు మాకొద్దు: బాధితురాలు

image

కరూర్‌ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాల సహాయార్థం TVK చీఫ్ విజయ్ రూ.20 లక్షల చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. అయితే మృతుల్లో ఒకరైన రమేశ్ భార్య సంఘవి ఆ డబ్బును తిప్పి పంపడం చర్చనీయాంశమైంది. ‘మాకీ డబ్బు ముఖ్యం కాదు. నేరుగా వచ్చి పరామర్శిస్తానని, ముందు డబ్బు తీసుకోమని చెప్పారు. ఆయన పరామర్శ కోసం ఎదురుచూశాం. చెన్నై సమావేశానికి వెళ్లేందుకు మేము నిరాకరిస్తే మా బంధువులను తీసుకెళ్లారు’ అని తెలిపారు.

News October 29, 2025

ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

image

పీరియడ్స్‌లో అమ్మాయిలు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకు ఓ సారి ప్యాడ్స్ మార్చాలి. మైల్డ్, సువాసన లేని సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.

News October 29, 2025

30 ఇంజినీర్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 30 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు.. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.590, SC,ST,దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/