News June 25, 2024

నేడు కుప్పానికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ, రేపు ఆయన అక్కడ పర్యటించనున్నారు. సీఎం అయ్యాక తొలిసారిగా వస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తన పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను CBN కలవనున్నారు. కాగా కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా ఎనిమిదోసారి గెలిచారు. 1989 నుంచి ఆయనకు ఇక్కడ ఎదురులేకుండా పోయింది.

Similar News

News December 6, 2025

కేంద్ర మంత్రి రామ్మోహన్‌పై విమర్శలు.. తిప్పికొట్టిన ఎంపీలు

image

ఇండిగో వివాదం నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు తోటి MPలు మద్దతుగా నిలిచారు. ‘రామ్మోహన్ UDAN పథకాన్ని ప్రోత్సహించారు. దీనివల్ల కొత్త ఎయిర్‌లైన్స్‌కు అవకాశాలు వస్తాయి. ఈ రంగంలో కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించారు. సంక్షోభాల్లో విమానయాన సంస్థలను జవాబుదారీగా చేశారు. ప్రయాణికులకు అండగా నిలబడ్డారు’ అని పెమ్మసాని, లావు ట్వీట్లు చేశారు.

News December 6, 2025

గ్లోబల్ డిఫెన్స్ మాన్యుఫాక్చర్ హబ్‌గా ఇండియా

image

రక్షణ ఉత్పత్తుల తయారీలో గ్లోబల్ హబ్‌గా భారత్ ముందడుగు వేస్తోంది. 2029లో ₹3Tల మేర ఉత్పత్తి చేయడంతో పాటు ₹50,000 కోట్ల విలువైన ఎగుమతులు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇండియన్ ARMY, NAVY, AIRFORCEకు సంబంధించిన ₹670 Bల ప్రపోజల్‌ను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించింది. FY27లో రక్షణరంగ బడ్జెట్‌ 20% మేర పెరగవచ్చని ఇప్పటికే రక్షణ శాఖ సంకేతాలు పంపింది. దీంతో రక్షణ ఉత్పత్తులు ఊపందుకోనున్నాయి.

News December 6, 2025

టాస్ గెలిచిన భారత్

image

విశాఖలో సౌతాఫ్రికాతో జరిగే మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 20 వన్డేల తర్వాత టీమ్ ఇండియా టాస్ గెలవడం విశేషం. సుందర్ స్థానంలో తిలక్ వర్మ జట్టులోకి వచ్చారు.

భారత్: జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (C), తిలక్ వర్మ, జడేజా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.