News January 1, 2025

దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు కొత్త ఏడాది సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు.

Similar News

News January 4, 2025

నాకు ఆ తెలివి ఉంది: రోహిత్

image

జట్టు నుంచి తప్పుకుంటే రిటైర్మెంట్ తీసుకున్నట్లు కాదని రోహిత్ శర్మ స్పష్టం చేశారు. ఓ మ్యాచ్‌‌కు దూరమైతే తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వలేనని అర్థం కాదు కదా అన్నారు. ఎవరో ల్యాప్‌టాప్ ముందో, పెన్ పట్టుకొని కూర్చొని తన రిటైర్మెంట్, కెప్టెన్సీ గురించి నిర్ణయించలేరని తెలిపారు. తాను సెన్సిబుల్ వ్యక్తినని, ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన తనకు జీవితంలో ఎప్పుడు ఏం కావాలో నిర్ణయించుకునే తెలివి ఉందని చెప్పారు.

News January 4, 2025

అల్లు అర్జున్‌కు కోర్టు షరతులు

image

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు పలు షరతులు విధించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు రెండు నెలల పాటు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. అటు బన్నీకి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు నాంపల్లి కోర్టులో వాదించారు.

News January 4, 2025

లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 101/5

image

సిడ్నీలో జరుగుతున్న BGT ఐదో టెస్టు రెండో రోజు తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా కీలక వికెట్లను కోల్పోయింది. లంచ్ సమయానికి 101/5 స్కోర్ చేసింది. వెబ్‌స్టర్ (28), క్యారీ (4) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, ప్రసిద్ధ్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం AUS తొలి ఇన్నింగ్స్‌లో 84 రన్స్ వెనుకబడి ఉంది. కొన్‌స్టాస్ 23, ఖవాజా 2, లబుషేన్ 2, స్మిత్ 33, హెడ్ 4 రన్స్ చేశారు.