News June 29, 2024
ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వనున్న సీఎం చంద్రబాబు!

AP: సీఎం చంద్రబాబు స్వయంగా తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. దేశ చరిత్రలో ఓ సీఎం ఇలా చేయడం ఇదే తొలిసారి. ఇప్పటికే అధికారులు ఆ గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. జులై 1నుంచి రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేయాలని CBN ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ పంపిణీ చేసేలా సర్దుబాటు చేయాలన్నారు.
Similar News
News December 29, 2025
ఏడు కురచలు చూచి ఎద్దును కొనాలి(1/2)

పూర్వం ట్రాక్టర్లు లేని కాలంలో వ్యవసాయానికి ఎద్దులే ఆధారం. ఒక ఎద్దు పనికి వస్తుందో లేదో దాని శారీరక లక్షణాలను బట్టి అప్పటి అనుభవజ్ఞులైన రైతులు అంచనా వేసేవారు. ఈ సామెతలోని “ఏడు కురచలు” అంటే ఎద్దుకు ఉండాల్సిన ఏడు పొట్టి (చిన్న) అవయవాలు. మెడ, తోక, చెవులు, కొమ్ములు, ముఖం, వీపు, గిట్టలు పొట్టిగా లేదా చిన్నగా ఉన్న ఎద్దును కొనాలని నాడు పెద్దలు చెప్పేవారు.
News December 29, 2025
హైదరాబాద్ ESICలో 102 పోస్టులు.. నేటి నుంచి ఇంటర్వ్యూలు

<
News December 29, 2025
చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రమిదే…

యానికాని చ పాపాని జన్మాంతరకృతానిచ|
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావనే రక్ష రక్ష మహేశ్వర ||


