News July 1, 2024
4న ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

AP: ఈనెల 4వ తేదీన సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన సమావేశమవుతారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి నిధుల కేటాయింపులపై సీఎం వారితో చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. విభజన హామీల అమలుపైనా చర్చించనున్నట్లు పేర్కొన్నాయి.
Similar News
News September 18, 2025
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. అనుకోకుండా ఉగ్రవాదులు దాడులు జరిపినప్పుడు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఈ మాక్ డ్రిల్ చేశారు. ఆలయంలోనూ, కొండపైన, పరిసరాల్లో ఆక్టోపస్, పోలీస్, అగ్నిమాపక, రెవిన్యూ, వైద్య, దేవస్థానం సిబ్బంది ఈ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు.
News September 18, 2025
‘OG’ టికెట్ ధరల పెంపు.. YCP శ్రేణుల ఫైర్

పవన్ కళ్యాణ్ OG సినిమా <<17742687>>టికెట్<<>> రేట్లను పెంచడంపై వైసీపీ శ్రేణులు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బెనెఫిట్ షోకు ఏకంగా రూ.1,000 (జీఎస్టీ కలుపుకుని) ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పుష్ప-2 సినిమా టికెట్ ధరలను సైతం (రూ.800+GST) పెంచిన విషయం గుర్తు లేదా అని పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News September 18, 2025
మళ్లీ భారత్vsపాకిస్థాన్ మ్యాచ్.. ఎప్పుడంటే?

ఆసియా కప్-2025లో భారత్vsపాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి. సూపర్-4లో ఈ ఆదివారం (Sep 21) రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజీలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. కాగా గ్రూప్-A నుంచి భారత్, పాక్ సూపర్-4కు క్వాలిఫై అయ్యాయి. సూపర్-4లో ఒక్కో జట్టు 3 మ్యాచులు ఆడనుంది. అటు గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ సూపర్-4 రేసులో ఉన్నాయి.