News June 12, 2024

మెగా డీఎస్సీపైనే CM చంద్రబాబు తొలి సంతకం?

image

AP: నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఆయన మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేస్తారని తెలుస్తోంది. పెన్షన్ రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం చేస్తారట. 4వ సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై, 5వ సంతకం స్కిల్ సెన్సెస్‌పై ఉంటుందని తెలుస్తోంది.

Similar News

News February 26, 2026

‘ది కేరళ స్టోరీ-2’ సినిమాపై స్టే

image

‘ది కేరళ స్టోరీ-2’ సినిమా విడుదలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. ఇందులో వివాదాస్పద అంశాలున్నాయని పేర్కొంది. మూవీ చూడకుండానే CBFC సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఈ సినిమా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ దాఖలైన పిటిషన్లపై రెండు రోజుల క్రితం HC విచారణ జరిపింది. తాము సినిమా చూశాకే నిర్ణయం చెబుతామని తెలిపింది. ఈక్రమంలోనే సినిమా చూసి స్టే ఇచ్చింది.

News February 26, 2026

రేపటి వరకు ఈ జిల్లాల్లో వర్షాలు!

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం 8.30 గంటల వరకు తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మీ ప్రాంతంలో ఇవాళ వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.

News February 26, 2026

37 రాజ్యసభ స్థానాలు.. నామినేషన్లు షురూ

image

దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. చివరి తేదీ మార్చి 5. నిర్ణీత స్థానాల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో మార్చి 16న 9AM నుంచి 5PM వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. మహారాష్ట్ర-7, TN-6, బిహార్-5, బెంగాల్-5, ఒడిశా-4, అస్సాం-3, <<19214239>>TG-2<<>>, ఛత్తీస్‌గఢ్-2, హరియాణా-2, హిమాచల్‌-ఒక సీటుకు ఎన్నికలు జరగనున్నాయి.