News October 16, 2024
రాజధానిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీకి ఏకైక రాజధాని అమరావతే అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఒకే రాజధాని అనేది ఎన్డీఏ పాలసీ అని చెప్పారు. ‘అమరావతి రాజధాని. విశాఖ ఆర్థిక రాజధాని. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం. కర్నూలు ఇండస్ట్రియల్ హబ్‌గా, అద్భుతమైన సిటీగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం’ అని తెలిపారు.
Similar News
News January 9, 2026
BCCIతో వార్.. బంగ్లా ప్లేయర్ల ఆదాయానికి గండి!

BCCIతో వివాదానికి తెరలేపిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (BCB) అసలు సెగ తగలనుంది. భారత్‌లో సెక్యూరిటీపై అనుమానాలు, IPL ప్రసారాల నిలిపివేత వంటి నిర్ణయాలకు నిరసనగా మన దేశీయ స్పోర్ట్స్ బ్రాండ్లు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ బంగ్లా ప్లేయర్లతో ఉన్న బ్యాట్ స్పాన్సర్షిప్ డీల్స్‌ను ఇండియన్ కంపెనీ ‘SG’ రద్దు చేసుకునే యోచనలో ఉంది. ఇదే బాటలో మరిన్ని బ్రాండ్లూ నడిచేలా ఉన్నాయి.
News January 9, 2026
ట్రంప్ మాస్టర్ ప్లాన్.. గ్రీన్లాండ్ ప్రజలకు డాలర్ల వల?

గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకునేందుకు ట్రంప్ టీమ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. అక్కడి ప్రజలను ప్రలోభపెట్టేందుకు ఒక్కొక్కరికి లక్ష డాలర్ల వరకు ఆఫర్ చేయాలని వైట్‌హౌస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కుదరకపోతే COFA ఒప్పందం ఆప్షన్‌ను పరిశీలిస్తున్నారట. దీని ప్రకారం.. గ్రీన్లాండ్లో US ఆర్మీ కార్యకలాపాలు కొనసాగించుకుంటుంది. దీనికి ప్రతిఫలంగా USతో గ్రీన్లాండ్ డ్యూటీ ఫ్రీ ట్రేడ్ చేసుకోవచ్చు.
News January 9, 2026
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

గువాహటిలోని <


