News September 18, 2024

వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

image

AP: వాలంటీర్లపై NDA శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వాలంటీర్ల పదవీకాలం ఏడాది క్రితమే పూర్తైతే, రెన్యూవల్ చేయలేదు. వాళ్ల పేరోల్స్(జీతాల బిల్లులు) కూడా లేరు. వైసీపీ నేతలు చేసిన పనికి వాలంటీర్లు అనే వాళ్లు రికార్డుల్లోనే లేకుండా పోయారు. కానీ మనం 3 నెలల జీతం ఇచ్చాం. కొందరు రాజీనామా చేశారు. చేయని వాళ్లకు ఇచ్చిన ఆర్డర్స్‌కు కూడా గడువు ముగిసింది’ అని సీఎం వ్యాఖ్యానించారు.

Similar News

News September 19, 2024

వరదల తర్వాత అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయింది: VSR

image

AP: విజయవాడ వరదల తర్వాత రాజధాని అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బుడమేరు వరదలు, అమరావతి భవిష్యత్‌పై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఒకరి కల కోసం రాష్ట్రానికి కోట్లు ఖర్చు చేసే స్థోమత లేదు. పెట్టుబడి దారుల విశ్వాసం సన్నగిల్లింది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.

News September 19, 2024

ఆ సంస్థ ఉద్యోగులకు ఇండియా హెడ్ మెయిల్

image

ప‌నిఒత్తిడి కార‌ణంగా 26 ఏళ్ల CA మృతి చెందిన ఘ‌ట‌న‌పై EY సంస్థ India ఛైర్మన్ రాజీవ్ మేమాని ఉద్యోగుల‌కు పంపిన మెయిల్ వెలుగులోకొచ్చింది. సంస్థ‌లో బాధితురాలి ప్ర‌యాణం త‌క్కువ కాలంలోనే ముగిసింద‌ని, ఈ విష‌యంలో ఆమె త‌ల్లిదండ్రులు త‌న‌కు రాసిన లేఖ‌ను సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్య‌క‌ర‌మైన, స‌మ‌తుల్య ప‌ని వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని పేర్కొన్నారు.

News September 19, 2024

అశ్విన్ ఫైటింగ్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 339/6 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (102) సెంచరీతో చెలరేగారు. రవీంద్ర జడేజా (86) సహకారంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (56) అర్ధ సెంచరీతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మొహమూద్ 4, రానా, మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.