News August 5, 2024

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

image

AP: అమరావతిలో ఆర్5 జోన్ లబ్ధిదారుల అంశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్5 జోన్‌లో విజయవాడ, గుంటూరు వాసులకు గత ప్రభుత్వం ఇళ్లు కేటాయించింది. వారికి సొంత ప్రాంతాల్లోనే స్థలం ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. అవసరమైతే టిడ్కో ఇళ్లను నిర్మించి ఇద్దామని అధికారులతో సీఎం చెప్పినట్లు సమాచారం.

Similar News

News March 13, 2026

హార్ముజ్‌లో నౌకలకు రక్షణ ఇవ్వలేం.. చేతులెత్తేసిన అమెరికా!

image

హార్ముజ్‌ జలసంధిని దాటుకొని నౌకలు <<19338961>>ధైర్యంగా వెళ్లాలని<<>> చెప్పిన అమెరికా ఇప్పుడు చేతులెత్తేసింది. ‘హార్ముజ్‌ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పించలేం. ప్రస్తుతానికి మేం రెడీగా లేము. ఇరాన్‌పై దాడులు చేయడంపైనే మా సైన్యం దృష్టి ఉంది. ఈ నెలాఖరుకు ఎస్కార్ట్ కల్పించే ఛాన్స్ ఉంది’ అని US ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ చెప్పారు. ఇవాళ US షిప్‌పై ఇరాన్ <<19364482>>దాడి చేయడం<<>> తెలిసిందే.

News March 13, 2026

65 లక్షల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు: రేవంత్

image

TG: వైద్యం యాంత్రికంగా ఉండొద్దని, మానవత్వంతో కూడిన చికిత్స అందించాలని CM రేవంత్ అన్నారు. ప్రైవేట్ రంగంలోని డాక్టర్లు ఏడాదిలో ఒక నెల ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేయాలని చెప్పారు. ‘రాష్ట్రంలో 65L మంది హెల్త్ డేటా తయారు చేస్తున్నాం. వాళ్లకు డిజిటల్ హెల్త్ కార్డులిస్తాం’ అని తెలిపారు. 1.30 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా అందించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. క్యాన్సర్‌కు చికిత్స పైనా దృష్టి పెట్టామన్నారు.

News March 13, 2026

CECపై అవిశ్వాసం.. రేపు నోటీసులు?

image

చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. రేపు పార్లమెంటులోని ఏదో ఒక సభలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రెండు సెట్ల నోటీసులపై 193 మంది(130 లోక్‌సభ, 63 రాజ్యసభ) ఎంపీలు సంతకం చేసినట్లు సమాచారం. CECపై 7 ఆరోపణలు చేసినట్లు ప్రతిపక్ష వర్గాలు చెప్పాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని కోరుతూ నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి కానుంది.