News June 28, 2024
పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు లేఖ
AP: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ CM చంద్రబాబు పెన్షన్దారులకు లేఖ రాశారు. దీన్ని పెన్షన్లతోపాటు జులై 1న ఉద్యోగులు పంపిణీ చేయనున్నారు. ‘మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 65,18,496 మందికి పెంచిన పింఛన్లు అందిస్తున్నాం. దీనివల్ల నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడుతున్నా మీ శ్రేయస్సు కోసం అమల్లోకి తెచ్చాం. రూ.7వేలు మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News January 14, 2025
భారత్కు నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది అప్పుడే: మోహన్ భగవత్
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన జరిగిన రోజే భారత్కు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అందుకే ఆ రోజును ‘ప్రతిష్ఠా ద్వాదశి’గా జరుపుకోవాలని చెప్పారు. రామ మందిర ఉద్యమం ఏ ఒక్కరినీ వ్యతిరేకించడానికి కాదని తెలిపారు. ఈ క్రమంలో భారత్ స్వతంత్రంగా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబడుతుందని పేర్కొన్నారు. కాగా గత ఏడాది జనవరి 22న రామ విగ్రహ ప్రతిష్ఠ చేసిన సంగతి తెలిసిందే.
News January 14, 2025
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
TG: ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జరిగే కాంగ్రెస్ జాతీయ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మరుసటి రోజు సింగపూర్ వెళ్లనున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు అక్కడే పర్యటించనున్నారు. అనంతరం ఈ నెల 20న వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్కు వెళ్తారు. ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ రానున్నారు.
News January 14, 2025
కాంగ్రెస్ పాలనలోని తెలంగాణ పరిస్థితి ఇదే: కేటీఆర్
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని తెలంగాణ పరిస్థితి Kakistocracyగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పదానికి అర్థం పనికిరాని లేదా తక్కువ అర్హత కలిగిన చిత్తశుద్ధి లేని పౌరుల చేతిలో పాలన ఉండటం. బీఆర్ఎస్ నేతల వరుస అరెస్టులను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.