News February 19, 2025

కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

image

AP: మద్దతు ధర లేక ఇబ్బందిపడుతున్న మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు CM చంద్రబాబు లేఖ రాశారు. రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాగు వ్యవసాయానికి విక్రయ ధర మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని సూచించారు. 50శాతం నిష్పత్తిలో కాకుండా వందశాతం నష్టం భరించాలని లేఖలో విన్నవించారు.

Similar News

News February 21, 2025

సాత్విక్ సాయిరాజ్‌ తండ్రి గుండెపోటుతో మృతి

image

AP: స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ ఇంట్లో విషాదం నెలకొంది. కొడుకుకు ‘ఖేల్‌రత్న’ చూసి మురిసిపోవాల్సిన తండ్రి కాశీ విశ్వనాథం(65) గుండెపోటుతో చనిపోయారు. ఢిల్లీలో అవార్డు ప్రదానోత్సవం కోసం నిన్న అమలాపురం నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఆయన కుప్పకూలారు. USలో ఉన్న సాత్విక్ సోదరుడు వచ్చాక అంత్యక్రియలు చేస్తారు. 2023కు గాను సాత్విక్‌ ఖేల్‌రత్నకు ఎంపికవగా పలుకారణాలతో అప్పుడు తీసుకోలేదు.

News February 21, 2025

రకుల్ సినిమాకు వన్ ప్లస్ వన్ ఆఫర్!

image

రకుల్ ప్రీత్ సింగ్, భూమీ పెడ్నేకర్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మేరే హస్బెండ్‌కీ బీవీ’. ఈరోజు విడుదల కానున్న ఈ సినిమాకు మేకర్స్ వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ప్రకటించారు. ‘ఛావా’తో పోటీని తట్టుకునేందుకు నిర్మాత ఈ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. అయితే అర్జున్ కపూర్‌కు పెద్దగా ఇమేజ్ లేకపోవడం, రొటీన్ స్టోరీ లైన్, ఛావా దూకుడు మూవీకి మైనస్ కావొచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

News February 21, 2025

ఇవాళ్టి నుంచి టమాటా కొనుగోళ్లు

image

AP: టమాటా ధరల పతనం నేపథ్యంలో ఇవాళ్టి నుంచి రైతుల పంటను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేసింది. అయితే ఏ రేటుతో అనేది వెల్లడించలేదు. ఆ టమాటాను రైతు బజార్లలో విక్రయించనుంది. అవసరం మేరకు పొరుగు రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించింది. కర్నూలు జిల్లా ఆస్పరి, పత్తికొండ మార్కెట్లో కేజీ <<15523622>>రూ.4కు చేరిన<<>> విషయం తెలిసిందే.

error: Content is protected !!