News April 6, 2025
కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

AP: అమెరికా సుంకాలతో నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు CM చంద్రబాబు లేఖ రాశారు. ‘ఈ సుంకాల నుంచి ఆక్వాకు మినహాయింపు ఇచ్చి రైతులను ఆదుకోవాలి. రాష్ట్ర GDPలో మత్స్యరంగానిది కీలక పాత్ర. అమెరికా భారత్‌పై 27% సుంకం విధించింది. ఈక్వెడార్‌పై USA 10% సుంకమే విధించింది. ఇది మనకూ నష్టమే. ఏపీలో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. USAతో చర్చించండి’ అని లేఖలో విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 8, 2025
షూటింగ్ వరల్డ్ కప్: భారత్ ఖాతాలో 5 మెడల్స్

అర్జెంటీనా రాజధాని బ్వేనోస్ ఐరిస్‌లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్ ఇప్పటివరకు 5 మెడల్స్(3 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్) సాధించింది. తాజాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 18ఏళ్ల సురుచి ఫొగట్ స్వర్ణ పతకం సాధించారు. మరోవైపు ఒలింపిక్ మెడల్స్ విజేత మను భాకర్ ఒక్క పాయింట్ తేడాతో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. అత్యధిక మెడల్స్ గెలిచిన దేశాల్లో చైనా(7) తొలి స్థానంలో ఉండగా IND రెండో స్థానంలో ఉంది.
News April 8, 2025
IPLలో ఫాస్టెస్ట్ సెంచరీలు (బంతుల్లో)

30 – క్రిస్ గేల్ (RCB) vs PWI, బెంగళూరు, 2013
37 – యూసుఫ్ పఠాన్ (RR) vs MI, ముంబై, 2010
38 – డేవిడ్ మిల్లర్ (KXIP) vs RCB, మొహాలీ, 2013
39 – ట్రావిస్ హెడ్ (SRH) vs RCB, బెంగళూరు, 2024
39 – ప్రియాంశ్ ఆర్య (అన్క్యాప్డ్ ప్లేయర్) (PBKS) vs CSK, ముల్లన్పూర్, 2025*
☞ ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాళ్లలో ప్రియాంశ్ రెండో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో యూసుఫ్ పఠాన్ ఉన్నారు.
News April 8, 2025
ఏప్రిల్ 10 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. సాలకట్ల వసంతోత్సవాలు ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు ముగిసేటట్లుగా నిర్వహిస్తారు.