News July 4, 2024
ఢిల్లీలో సీఎం చంద్రబాబు మీటింగ్స్ ఇలా..

AP: సీఎం చంద్రబాబు నేడు, రేపు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. ఇవాళ ఉ.10.15 గంటలకు PM మోదీతో కీలక అంశాలపై చర్చిస్తారు. మ.12.15కు గడ్కరీ, మ.2గంటలకు శివరాజ్‌సింగ్, మ.2.45కు అమిత్ షా, సా.5.15కు మనోహర్ లాల్ ఖట్టర్, సా.6 గంటలకు హర్దీప్ సింగ్ పురీతో భేటీ అవుతారు. రేపు ఉ.9 గంటలకు నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం, ఉ.10కి నిర్మలా సీతారామన్, ఉ.10.45కు జేపీ నడ్డా, మ.12.30కు రామ్‌దాస్ అఠావలెతో సమావేశమవుతారు.
Similar News
News January 19, 2026
బొగ్గు టెండర్ల పంచాయితీ.. నివేదిక కోరిన కేంద్రం!

ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై కేంద్ర బొగ్గు శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. పాలసీ పరమైన లోపాలు జరిగినట్లు సమాచారం అందడంతో టెండర్ల ప్రక్రియ వివరాలు సమర్పించాలని సింగరేణిని కోరింది. సింగరేణిలో బొగ్గు మంత్రిత్వ శాఖకు 49%, తెలంగాణ ప్రభుత్వానికి 51% వాటా ఉంది. బొగ్గు శాఖ నైనీ బ్లాకులను ఎస్సీసీఎల్కు కేటాయించగా, తెలంగాణ ప్రభుత్వం 2025లో టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది.
News January 19, 2026
బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్‌లైన్!

భద్రతా కారణాలతో T20 WC మ్యాచుల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ <<18885677>>కోరుతుండటం<<>> తెలిసిందే. ఈ క్రమంలో మార్పు సాధ్యం కాదని BCBకి ICC చెప్పినట్లు సమాచారం. తుది నిర్ణయం చెప్పేందుకు ఈ నెల 21 వరకు డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. ఒకవేళ బంగ్లా టోర్నీ నుంచి నిష్క్రమిస్తే ర్యాంకింగ్ ప్రకారం స్కాట్లాండ్ మ్యాచులు ఆడనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంక వేదికగా WC ప్రారంభం కానుంది.
News January 19, 2026
ఈ కలెక్టర్ ఎందరికో స్ఫూర్తి!

జిల్లాలోని పేదలందరికీ పథకాలు అందే వరకు జీతం తీసుకోనని ప్రతిజ్ఞ చేశారో కలెక్టర్. ‘ఫ్రీ రేషన్, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పలన్హర్ యోజన, పేదలు, వితంతువులకు పెన్షన్ పథకాలకు లబ్ధిదారులందరినీ నమోదు చేయాలని అధికారులను ఆదేశించా. లేదంటే జీతం తీసుకోనని చెప్పా. వారిని మోటివేట్ చేసేందుకే ఇలా చేశా’ అని రాజ్‌సమంద్(RJ) కలెక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. పేదలకు పథకాలు ఆలస్యమవడమంటే అన్యాయం చేయడమేనని చెప్పారు.


