News March 13, 2025
సీఎం చంద్రబాబు పేరు సూర్యబాబు అవుతుందేమో: RRR

AP: అసెంబ్లీలో సీఎం చంద్రబాబుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోలార్ విద్యుత్‌పై చర్చ సందర్భంగా ‘సూర్యశక్తిని ఒడిసిపడుతున్నందుకు సీఎం చంద్రబాబు పేరు ఇక సూర్యబాబుగా మారుతుందేమో’ అని అన్నారు. వెంటనే స్పందించిన సీఎం ‘మీరేదో నాకు కరెంట్ షాక్ ఇవ్వాలనుకుంటున్నారు’ అని నవ్వుతూ అన్నారు. దీంతో సభలోని మిగతా సభ్యులూ నవ్వారు.
Similar News
News March 6, 2026
నా కథను రేప్ చేశారు.. రచయిత షాకింగ్ కామెంట్స్

సినీ రచయిత సాయిమాధవ్ బుర్రా FBలో షాకింగ్ పోస్టు చేశారు. ఓ మూవీలో తన కథను రేప్ చేశారని ఆరోపించారు. ‘నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. ఒక్కమాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు. కథని మానభంగం చేశారు. నాది రివేంజ్ డ్రామా కాదు. నా సోల్ వేరు.. అసలా కథే వేరు’ అని రాసుకొచ్చారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కి, ఇవాళ రిలీజైన ‘సరస్వతి’ గురించే ఆయన మాట్లాడినట్లు సమాచారం.
News March 6, 2026
మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయం: CM

TG: మూసీ నదిలో చెత్త, మురికి పేరుకుపోయిందని, అలాంటి వాతావరణంలో ఉండాలని ఎవరూ కోరుకోరని CM రేవంత్ చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వ్యాపారాలను విస్తరిస్తామని తెలిపారు. రంగారెడ్డి(D) కొత్వాల్‌గూడలో ఎకో పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘అభివృద్ధి జరగాలంటే కొందరు భూమి కోల్పోవాల్సి ఉంటుంది. కానీ ఎవరికీ అన్యాయం చేయం. అందరితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాం’ అని హామీ ఇచ్చారు.
News March 6, 2026
ఎల్లుండే ఫైనల్.. మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?

అహ్మదాబాద్ వేదికగా IND-NZ మధ్య ఎల్లుండి T20WC ఫైనల్ జరగనుంది. వర్షం లేదా ఏదైనా కారణాలతో ఆ రోజు మ్యాచ్ జరగకపోయినా, మధ్యలో ఆగిపోయినా మరుసటి రోజు రిజర్వ్ డే ఉంటుంది. ఆగిన దగ్గర నుంచే మ్యాచ్ జరుగుతుంది. రెండు రోజులూ 120 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఫైనల్ ఫలితం తేలాలంటే ఇరు జట్లూ కనీసం 10 ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. దురదృష్టవశాత్తూ 2 రోజులూ మ్యాచ్ జరగకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ఐసీసీ ప్రకటిస్తుంది.


