News August 20, 2024
నూతన విద్యుత్ విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష

AP: ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 పేరిట ప్రభుత్వం కొత్త విద్యుత్ విధానాన్ని తీసుకురానుంది. దీనిపై అధికారులతో CM చంద్రబాబు సమీక్షించారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, బయో ఎనర్జీకి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగేలా పాలసీని రూపొందించాలని అధికారులకు CM సూచించారు. తక్కువ ధరకే విద్యుత్ సరఫరా, మిగులు విద్యుత్ విక్రయించేలా పాలసీ ఉండాలన్నారు. ఈ రంగంలో పెట్టుబడులపైనా చర్చించారు.
Similar News
News October 14, 2025
కోహ్లీ, రోహిత్ రిటైర్ అవ్వట్లేదు: BCCI VP

భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ కాబోతున్నారని, ఆస్ట్రేలియా సిరీసే చివరిదని జరుగుతున్న ప్రచారాన్ని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఖండించారు. ‘రోహిత్, కోహ్లీ ప్రజెన్స్ జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇద్దరూ గ్రేట్ ప్లేయర్స్. ఆస్ట్రేలియాను ఓడించడంలో వారు కీలకం. రిటైర్మెంట్ ప్లేయర్ల ఇష్టం. కానీ ఇది వారి చివరి సిరీస్ మాత్రం కాదు. అలాంటి ఆలోచన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు.
News October 14, 2025
TIDCOకు అప్పుగా ₹300 కోట్ల నిధులు

AP: టిడ్కో ఇళ్ల బిల్లుల చెల్లింపునకు ₹300 కోట్ల రుణం మంజూరుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. రాజీవ్ స్వగృహ నుంచి ₹200 కోట్లు, APUFIDC నుంచి ₹100 కోట్లు టిడ్కోకు ఇవ్వాలని ఆదేశించింది. కాగా టిడ్కో ఇళ్లకోసం హడ్కో ₹4450 కోట్లు మంజూరు చేసినప్పటికీ ప్రభుత్వం, లబ్ధిదారుల వాటా నిధుల ఆలస్యం వల్ల చాలా చోట్ల పనులు నిలిచిపోయాయి. ₹450 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నట్లు టిడ్కో ప్రభుత్వానికి తెలిపింది.
News October 14, 2025
ప్రధాని కర్నూలు పర్యటనను ఖరారు చేసిన పీఎంవో

AP: ఈ నెల 16న కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనపై PMO అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. 11.15amకు శ్రీశైలం ఆలయంలో పూజలు చేసి, 12:15pmకు శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శిస్తారని పేర్కొంది. 2:30pmకు కర్నూలులో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపనతో సహా రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని తెలిపింది. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించింది.