News April 12, 2025

సీఎం చంద్రబాబు సంతకం ఫోర్జరీ.. అధికారిపై కేసు

image

AP: అనంతపురం(D) గుత్తి సబ్ డివిజినల్ కార్యాలయంలో సీనియర్ ఇన్‌స్పెక్టర్ సతీశ్ కుమార్ CM చంద్రబాబు, మంత్రి అచ్చెన్న సంతకాలను ఫోర్జరీ చేశారు. దీంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేశారు. గతేడాది ఎన్నికల సమయంలో షేర్ మార్కెట్ పనులు చేసుకుంటూ అతను విధులకు గైర్హాజరయ్యారు. దీంతో అతనిపై చర్యలకు ఆ శాఖ కమిషనర్ ఆదేశించారు. దీని నుంచి తప్పించుకునేందుకు CM, మంత్రి పేర్లతో సిఫారసు లేఖ తయారుచేసి సతీశ్ దొరికిపోయారు.

Similar News

News October 13, 2025

నకిలీ మద్యం కేసు.. జోగి రమేశ్ సవాల్

image

AP: నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి <<17996336>>జోగి రమేశ్<<>> మరోసారి స్పందించారు. ఇదంతా చంద్రబాబు అల్లిన కట్టు కథ అని ఆరోపించారు. తిరుమల సన్నిధిలో ప్రమాణం చేసేందుకు, లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ప్రమాణానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సిద్ధమా అని సవాల్ విసిరారు. జనార్ధన్‌తో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని, బలవంతంగా అతనితో తన పేరు చెప్పించారని మండిపడ్డారు.

News October 13, 2025

వైసీపీ నేరాలను టీడీపీపైకి నెట్టే కుట్ర: చంద్రబాబు

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో జరిగిన భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే నకిలీ మద్యం కేసూ ఉందన్నారు. అంతా వాళ్లే చేసి తమపై నింద మోపుతున్నారని చెప్పారు. క్రిమినల్ మాస్టర్ మైండ్‌కు జగన్ ఉదాహరణ అని, వైసీపీ క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వాళ్ల నేరాలను టీడీపీపై నెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

News October 13, 2025

కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్

image

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై అనిల్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు పెట్టారని, లాటరీలో షాపు దక్కకపోతే ఆ డబ్బు ఎక్సైజ్ శాఖకే వెళ్తుందన్నారు. షాప్ రానివారికి రూ.3 లక్షలు తిరిగిచ్చేలా ఆ శాఖను ఆదేశించాలని, ఆ GOను కొట్టేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఎక్సైజ్ శాఖకు నోటీసులు జారీ చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.