News January 16, 2025
ముంబై సేఫ్ కాదన్న సెలబ్రిటీలు.. ఖండించిన సీఎం

సైఫ్ అలీఖాన్‌పై కత్తిదాడి ఘటనతో ముంబై మరోసారి ఉలిక్కిపడింది. సల్మాన్ ఇంటి ముందు కాల్పులు, రాజకీయ నేత సిద్దిఖీ హత్య వంటి వరుస ఘటనలు జరుగుతుండటంతో ముంబై సేఫ్ కాదంటూ పలువురు సెలబ్రిటీలు SMలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాదనలను CM ఫడణవీస్ కొట్టిపారేశారు. ఒకటి, రెండు సంఘటనలను చూపుతూ ముంబై ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
Similar News
News September 18, 2025
చేతిలో బిట్ కాయిన్‌తో ట్రంప్ విగ్రహం

క్రిప్టో కరెన్సీకి మద్దతిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DCలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ బయట 12 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేతిలో బిట్ కాయిన్‌తో బంగారు వర్ణంలో ఈ విగ్రహం ఉంది. దీన్ని వెండి, అల్యూమినియంతో తయారు చేసి, బంగారు పూత వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ <<17745765>>రేట్లు<<>> తగ్గించిన కాసేపటికే దీన్ని ఆవిష్కరించారు.
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<
News September 18, 2025
RTCలో డ్రైవర్ పోస్టులు.. అర్హతలు ఇవే

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే. డ్రైవర్ పోస్టులకు వయో పరిమితి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. పేస్కేల్ రూ.20,960-60,080గా ఉంటుంది. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <