News December 10, 2024
రాజ్యసభ అభ్యర్థులను అభినందించిన సీఎం

AP: రాజ్యసభ ఉపఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులు ఆర్.కృష్ణయ్య, సానా సతీశ్, బీద మస్తాన్ రావు సీఎం చంద్రబాబును అమరావతిలోని క్యాంప్ ఆఫీసులో కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు మర్యాదపూర్వకంగా సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అటు 3 స్థానాలకు ముగ్గురే నామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా గెలవబోతున్న వీరిని చంద్రబాబు అభినందించారు.
Similar News
News January 24, 2026
చానక-కోరట ప్రాజెక్టు, రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులపై ADB కలెక్టర్ సమీక్ష

చానక-కోరట ప్రాజెక్టు భూసేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జి నిర్మాణాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సమీక్షించిన కలెక్టర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, ఆర్డీఓ స్రవంతి, నీటిపారుదల శాఖ ఈఈ విఠల్ రాథోడ్, రోడ్లు భవనాలు శాఖ ఈఈ నర్సయ్య, విద్యుత్ శాఖ ఎస్ఈ సుభాష్ తదితరులు ఉన్నారు.
News January 23, 2026
టీమ్ ఇండియా ఘన విజయం

న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇషాన్ కిషన్(76), కెప్టెన్ సూర్యకుమార్(82) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 209 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇండియన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో NZ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. మ్యాట్ హెన్రీ, జాకబ్, ఇష్ సోథీలకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో 5 T20ల సిరీస్లో ఇండియా 2-0 తేడాతో ఆధిపత్యం కొనసాగిస్తోంది.
News January 23, 2026
యూనస్ ఫాసిస్ట్, దేశద్రోహి: షేక్ హసీనా

BANలో యూనస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఆ దేశ మాజీ PM షేక్ హసీనా అన్నారు. ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియాలో ఆమె ఆడియో మెసేజ్ను నిర్వాహకులు ప్లే చేశారు. యూనస్ను ఫాసిస్ట్, దేశద్రోహిగా, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విదేశాలకు సేవ చేసే కీలు బొమ్మగా ఆమె అభివర్ణించారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతేడాది జరిగిన హింసాత్మక ఘటనలపై UNతో ఇన్వెస్టిగేషన్ చేయించాలన్నారు.


