News April 3, 2025
ఎయిర్‌ట్యాక్సీ రూపొందించిన అభిరామ్.. సీఎం అభినందన

AP: నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేలా ఎయిర్ ట్యాక్సీ రూపొందించిన గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ CEO చావా అభిరామ్‌ను CM చంద్రబాబు అభినందించారు. తాను రూపొందించిన ట్యాక్సీ వివరాలు, ఫీచర్స్, ఖర్చు వంటివి సీఎంకు ఆయన వివరించారు. ప్రస్తుతం 2 సీట్ల సామర్థ్యంతో రూపొందించానని అభిరామ్ చెప్పారు. ఈ ప్రాజెక్టుపై సివిల్ ఏవియేషన్ అనుమతుల విషయంలో కేంద్రంతో మాట్లాడతామని CM ఆయనకు హామీ ఇచ్చారు.
Similar News
News December 30, 2025
చర్మానికి కోకో బటర్

కోకో బటర్‌ను చాక్లెట్స్, కేక్‌ల తయారీలోనే కాకుండా చర్మాన్ని మెరిపించడానికి కూడా వాడొచ్చంటున్నారు నిపుణులు. కోకో బటర్లో రోజ్ వాటర్ కలిపి పడుకునే ముందు చర్మానికి అప్లై చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఇందులో ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, చర్మం మెరిసేలా చేస్తుంది.
News December 30, 2025
ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు

ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్-2026 షెడ్యూల్ విడుదలైంది. జేఈఈ మెయిన్స్ ఫలితాలు వచ్చిన వెంటనే అర్హులైన అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 23-మే 2 వరకు దరఖాస్తుల స్వీకరించనుంది. ఏప్రిల్ 6- మే 2 వరకు ఫారినర్స్, భారత సంతతి విద్యార్థులకు రిజిస్ట్రేషన్‌కు అవకాశమిచ్చింది.
✧ మే 4 వరకు ఫీజు చెల్లింపునకు ఛాన్స్
✧ మే 11-17 హాల్ టికెట్లు డౌన్లోడ్
✧ మే 17న రెండు సెషన్లలో పరీక్ష
✧ జూన్ 1న ఫలితాలు
News December 30, 2025
అరటి గెలల నాణ్యత పెరగాలంటే?

అరటిలో పండు పరిమాణం, నాణ్యత పెంచేందుకు గెలల్లోని ఆఖరి హస్తం విచ్చుకున్న 5వ రోజు మరియు 15వ రోజున లీటరు నీటికి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రాములను కలిపి గెలలపై పిచికారీ చేయాలి. దీనితో పాటు 2 శాతం రంద్రాలు చేసిన తెల్లని పారదర్శక పాలిథీన్ సంచులను గెలలకు తొడగాలి. దీని వల్ల అరటిపండ్ల పరిమాణం పెరిగి లేత ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా తయారై నాణ్యమైన పండ్లను పొందవచ్చు. ఇవి ఎగుమతికి అనుకూలంగా ఉంటాయి.


