News July 10, 2025
మంత్రి లోకేశ్‌ను అభినందించిన సీఎం

AP: మంత్రి లోకేశ్ విద్యాశాఖను అద్భుతంగా నిర్వహిస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఆయన ఏరికోరి ఆ శాఖను ఎంచుకున్నారని తెలిపారు. ‘మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే పుణ్యక్షేత్రం పాఠశాల. చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతోకొంత సాయం చేయాలి. ఆడ, మగ బిడ్డలను సమానంగా చూసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే మేం ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్నాం’ అని సత్యసాయి జిల్లాలో తెలిపారు.
Similar News
News July 11, 2025
పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దాం: చంద్రబాబు

AP: పీ4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్ట్నర్షిప్) అమలుకు ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు మార్గదర్శకులుగా ఉండేందుకు పారిశ్రామికవేత్తలు, NIRలు వంటివారు 18,332మంది ముందుకొచ్చారు. వారిలో టాప్ 200మందిని ఈనెల 18న డిన్నర్‌లో సీఎం కలవనున్నారు. పీ4 లక్ష్యాలను వివరించి మరింత మందిని భాగస్వాములను చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని CM తెలిపారు. పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దామని పేర్కొన్నారు.
News July 11, 2025
ముగిసిన తొలి రోజు ఆట.. ENG స్కోర్ ఎంతంటే?

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ నిలదొక్కుకుంది. మూడో సెషన్ ఆరంభంలో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయినా రూట్ 99*, స్టోక్స్ 39* రన్స్‌తో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 251 రన్స్ చేసింది. భారత బౌలర్లలో నితీశ్ 2, బుమ్రా, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
News July 11, 2025
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలివే!

AP: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు TTD వెల్లడించింది. ప్రతిరోజూ ఉ.8-10 గంటల వరకు, రా.7-9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
* 16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, * 23-09-2025 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, * 24-09-2025 ధ్వజారోహణం, * 28-09-2025 గరుడ వాహనం, * 01-10-2025 రథోత్సవం,
* 02-10-2025 చక్రస్నానం