News April 11, 2025

ఏడాదిలో 5 ప్రభుత్వ ఉద్యోగాలు.. శిరీషకు సీఎం అభినందన

image

TG: అనారోగ్యంతో బాధపడుతూనే ఏడాదిలో 5 GOVT ఉద్యోగాలు సాధించిన ఖమ్మం(D)కు చెందిన జ్యోతి శిరీషను CM రేవంత్ అభినందించారు. ‘రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి, రక్తహీనతను లెక్కచేయకుండా జీవితంలో విజయం సాధించాలన్న శిరీష పట్టుదల ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆమెను ప్రోత్సహించిన పేరెంట్స్‌కు అభినందనలు. శిరీష భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

Similar News

News March 27, 2026

మహిళా రుణాల్లో గద్వాల జోరు: రాష్ట్రస్థాయిలో టాప్

image

మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బ్యాంకు లింకేజీ రుణాల అమలులో జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రుణాల పంపణీ లక్ష్యానికి చేరువలో ఉంది. ఉమ్మడి జిల్లాలో 1610.83 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.1541.66 కోట్లు పంపణీ చేశారు. అందులో 218.28 కోట్లు గద్వాలలో పంపిణీ మహిళలకు అందాయి.

News March 27, 2026

నేడు రాములోరి కళ్యాణానికి సీఎం

image

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భద్రాచలంలో పర్యటించనున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకొని రూ.351 కోట్లతో ఆలయ విస్తరణ తొలిదశ పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మిథిలా స్టేడియంలో 11:30AM నుంచి 12:30PM వరకు తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.

News March 27, 2026

2,300 కిలోల డ్రగ్స్ ఎలుకలు తినేశాయట!

image

గుజరాత్ పోలీస్ కస్టడీ నుంచి ఏకంగా 2,332 కిలోల డ్రగ్స్ మాయం కావడం చర్చనీయాంశమైంది. సీజ్ చేసిన స్టాక్‌లో ఇది 35% అని CAG రిపోర్ట్ వెల్లడించింది. దీనిపై హోం శాఖ వింత వివరణ ఇచ్చింది. సుమారు 144 కిలోల గంజాయి చోరీకి గురైందని తెలిపింది. మిగిలిన గంజాయి, నల్లమందును ఎలుకలు తినేశాయని లేదా తేమ వల్ల బరువు తగ్గి ఉండొచ్చని పేర్కొంది. అయితే ఈ ‘ఎలుకల థియరీ’పై కాగ్ అసహనం వ్యక్తం చేసింది.