News January 26, 2025
పద్మకు ఎంపికైన వారికి CM అభినందనలు

TG: పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి CM రేవంత్ అభినందనలు తెలిపారు. వైద్యరంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డికి పద్మవిభూషణ్, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన బాలకృష్ణకు పద్మ భూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ సహా ఈ పురస్కారాలకు <<15260048>>తెలుగువారు <<>>ఎంపిక కావడంపై CM హర్షం వ్యక్తం చేశారు. తాము ఎంచుకున్న రంగాల్లో చేసిన కృషి, అంకితభావమే వారికి ఈ పురస్కారాలు దక్కేలా చేసిందని కొనియాడారు.
Similar News
News October 31, 2025
BREAKING: భారత్ ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 126 పరుగుల టార్గెట్ను 6 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలోనే ఆసీస్ ఛేదించింది. మార్ష్ 46, ట్రావిస్ హెడ్ 28, ఇంగ్లిస్ 20 పరుగులతో రాణించారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. మొదటి టీ20 రద్దవ్వగా.. మూడో టీ20 నవంబర్ 2న జరగనుంది.
News October 31, 2025
3 రాష్ట్రాల్లో పోటీ.. ఓ గెలుపు.. తొలిసారి మంత్రి

TG: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, <<18158294>>మంత్రి అజహరుద్దీన్<<>> పొలిటికల్ జర్నీ 3 రాష్ట్రాల మీదుగా సాగింది. 2009లో INCలో చేరిన ఆయన మొరదాబాద్(UP) ఎంపీగా గెలిచారు. 2014లో టోంక్ సవాయూ మాధోపుర్(రాజస్థాన్) లోక్సభ స్థానంలో ఓడిపోయారు. 2019లో టికెట్ దక్కలేదు. 2023లో సొంతరాష్ట్రం తెలంగాణలోని జూబ్లీహిల్స్ MLAగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల మధ్య ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
News October 31, 2025
RITESలో 600 పోస్టులు.. అప్లై చేశారా?

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. వెబ్సైట్: https://www.rites.com


