News April 2, 2025
‘తల్లికి వందనం’ వారికే ఇవ్వాలని చెప్తే CM ఒప్పుకోలేదు: జ్యోతుల నెహ్రూ

AP: ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకే ‘తల్లికి వందనం’ అమలు చేయాలని CM చంద్రబాబుకు చెబితే ఆయన ఒప్పుకోలేదని MLA జ్యోతుల నెహ్రూ తెలిపారు. దీంతో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరుగుతాయని చెప్పినా వినలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ పథకం వర్తింపజేస్తామని సీఎం చెప్పినట్లు వివరించారు. కాగా, జూన్ 12లోపు ‘తల్లికి వందనం’ అమలు చేస్తామని నిన్న మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన విషయం తెలిసిందే.
Similar News
News April 3, 2025
కంచ భూముల వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

TG: హెచ్సీయూ కంచ భూముల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం విక్రయించాలన్న భూములను సందర్శించి మ.3.30 గంటలకు నివేదిక అందించాలని హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించింది. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చెట్లు నరకవద్దని సీఎస్ను SC ఆదేశించింది.
News April 3, 2025
నా వయసును నమ్మలేకపోతున్నాను: రష్మిక

ఈ నెల 5న 29వ పుట్టినరోజు చేసుకోనున్నట్లు హీరోయిన్ రష్మిక ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 29 ఏళ్లనే విషయం తనకే నమ్మశక్యంగా లేదని పేర్కొన్నారు. ఇది తన బర్త్ డే మంత్ అని పేర్కొంటూ వయసు పెరిగే కొద్దీ పుట్టినరోజును జరుపుకునేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె నటించిన ‘సికందర్’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది.
News April 3, 2025
SRHకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానం

HCAతో SRHకు వివాదం నెలకొన్న వేళ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ACA) సన్రైజర్స్ జట్టును APకి ఆహ్వానించింది. ఈ సీజన్లోని మిగతా మ్యాచ్లను విశాఖలో నిర్వహించాలని కోరింది. పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని ఆఫర్ చేసింది. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో SRH, HCA మధ్య వివాదం నెలకొనగా సీఎం రేవంత్ ఆదేశాలతో HCA దిగొచ్చింది. మరోవైపు ఈ సీజన్లో విశాఖలో 2 IPL మ్యాచ్లు జరిగిన విషయం తెలిసిందే.