News May 24, 2024

CMకి ఇక్కడి ఆర్తనాదాలు వినిపించవు: షర్మిల

image

AP: లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న సీఎం జగన్‌కు రాష్ట్రంలో జరుగుతున్న ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. 13ఏళ్ల ఓ విద్యార్థిని అత్యాచారానికి సంబంధించిన న్యూస్ క్లిప్‌ను షేర్ చేస్తూ సీఎం జగన్‌పై ఆమె విమర్శలు గుప్పించారు. ‘మీ పాలన మహిళల భద్రతకు, బతుకులకు పట్టిన పీడ అని దేశమంతా చెప్పుకుంటోంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 19, 2025

నేడు పుట్టపర్తికి మోదీ రాక

image

AP: సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుట్టపర్తికి రానున్నారు. బాబా మందిరాన్ని, మహాసమాధిని ఆయన సందర్శించనున్నారు. ఈ సందర్భంగా బాబా స్మారక నాణెం, స్టాంపులను విడుదల చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు సహా ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.

News November 19, 2025

భారత్‌ను ప్రేమించే వాళ్లందరూ హిందువులే: మోహన్ భాగవత్

image

భారత్‌ను ప్రేమించే వారందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూ దేశంగా ఇండియా ఉండటానికి అధికారిక డిక్లరేషన్ అవసరం లేదని, మన నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు దాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. అస్పాంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ‘హిందూ అనేది కేవలం మతపరమైన పదం కాదు. వేల ఏళ్ల నాగరికత గుర్తింపు. భారత్, హిందూ రెండూ పర్యాయపదాలు’ అని తెలిపారు.

News November 19, 2025

43 మంది నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు

image

బిహార్‌లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా 43 మంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వారిపై క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈనెల 21 లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ లోపు స్పందించకపోతే పార్టీ నుంచి తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.