News April 20, 2024
సివిల్స్ టాపర్‌కు సీఎం సత్కారం

TG: సివిల్స్ ఫలితాల్లో మెరిసిన దోనూరు అనన్య రెడ్డి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమెను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనన్య రెడ్డి అసాధారణ ప్రతిభతో తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే.
Similar News
News March 25, 2026
రామ్ చరణ్‌కు గాయం.. స్పందించిన ‘పెద్ది’ టీమ్

పెద్ది సినిమా షూటింగ్‌లో హీరో రామ్ చరణ్‌కు గాయమైందనే వార్తలపై మేకర్స్ స్పందించారు. ‘సెట్స్‌లో రామ్ చరణ్ ఎడమ కన్నుకు చిన్న గాయమైంది. చిన్న హెల్త్ ప్రొసీజర్ జరిగింది. ఇప్పుడు ఆయన క్షేమంగానే ఉన్నారు. రేపు షూటింగ్‌కు హాజరవుతారు. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవు’ అని పెద్ది టీమ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అంతా కంట్రోల్‌లోనే ఉందని, ఆందోళన అవసరం లేదని తెలిపింది.
News March 25, 2026
రాజమండ్రిలో పోలవరం ప్రాజెక్టు ఆఫీసు ప్రారంభం

AP: రాజమండ్రిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది. ఈ ఆఫీసును కేంద్ర జల శక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావు ప్రారంభించారు. తర్వాత పోలవరం పనులను పరిశీలించి, అధికారులతో ఆయన సమీక్షించారు. కాగా ఇప్పటివరకు PPA ప్రధాన ఆఫీసు హైదరాబాద్‌లో ఉండేది.
News March 25, 2026
మిచెల్ స్టార్క్‌కు DC షాక్ ఇవ్వనుందా?

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా IPL ఆరంభ మ్యాచులకు ఢిల్లీ స్టార్ బౌలర్ స్టార్క్ దూరం కానున్నారు. అయితే కొన్నిరోజుల్లో తన రాకపై అప్డేట్ ఇవ్వకపోతే జట్టు నుంచి తప్పించాలని యాజమాన్యం నిర్ణయించినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. స్టార్క్ స్థానంలో మరొక ప్లేయర్‌ను తీసుకోవడానికి సిద్ధమైనట్లు చెప్పాయి. AUS క్రికెట్ బోర్డు NOC ఇవ్వకపోవడంతో స్టార్క్ ఎప్పుడు జట్టులో జాయిన్ అవుతారనే దానిపై క్లారిటీ లేదు.


