News March 1, 2025
నాలుగోసారి సీఎంను.. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు: సీఎం చంద్రబాబు

AP: అడవి పందులు తిన్నంత తిని పంటలను తొక్కేసి పోతాయని, ఐదేళ్ల వైసీపీ పాలన ఇలాగే సాగిందని CM CBN విమర్శించారు. ‘మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చా. 2014-19 కంటే ఎక్కువ చేస్తానని ప్రజలంతా అనుకుంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి అర్థమైంది. ఆర్థికంగా లోతైన గోతులున్నాయి. నాలుగోసారి CM అయిన నాకే ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నా’ అని తెలిపారు.
Similar News
News March 1, 2025
దేశానికి రోల్ మోడల్లా పోలీస్ స్కూల్: సీఎం

TG: యంగ్ ఇండియా పోలీస్ స్కూలులో పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. HYD మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలోని ఈ స్కూలులో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్ను దేశానికి రోల్ మాడల్గా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. స్కూల్ <
News March 1, 2025
‘అందుకొనేంత దూరంలో అభివృద్ధి చెందిన దేశం’

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం అందుకొనేంత దూరంలోనే ఉందని 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ అరవింద్ పనగడియా అన్నారు. ఇందుకు కొన్ని సంస్కరణలు అవసరమని సూచించారు. ‘ప్రస్తుత ధరల వద్ద డాలర్ ప్రాతిపదికన 2003-24 వరకు భారత్ 10.1% వృద్ధిరేటు సాధించింది. మరో పదేళ్లు ఇదే రేటు కొనసాగిస్తే దేశం $9.5T ఎకానమీ అవుతుంది. 2047 నాటికి తలసరి ఆదాయం $14000 కావాలంటే 7.3% గ్రోత్ అవసరం’ అని వివరించారు.
News March 1, 2025
టీచర్ల బదిలీలు.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

AP: ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ మేరకు పారదర్శకంగా టీచర్ల ట్రాన్స్ఫర్ ప్రక్రియకు తాము కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 <