News November 30, 2024

నేడు ‘రైతు పండుగ’ సభకు సీఎం

image

TG: పాలమూరులో గత రెండు రోజులుగా నిర్వహిస్తోన్న రైతు పండుగకు సీఎం రేవంత్ రెడ్డి నేడు హాజరుకానున్నారు. లక్ష మంది రైతులతో నిర్వహించే ఈ సభ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సభలో సీఎం ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైతు భరోసా ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఎన్ని ఎకరాలకు ఇస్తారు? అనే విషయాలపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

Similar News

News January 9, 2026

‘జన నాయకుడు’ వివాదం.. నేడు కోర్టులో విచారణ

image

విజయ్ ‘జన నాయకుడు’ విడుదలపై మద్రాసు హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC) సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఇవాళ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. సెన్సార్ బోర్డు తీరుపై మేకర్స్ HCని ఆశ్రయించారు. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. న్యాయస్థానం తీర్పుపై విజయ్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుందో లేదో చూడాలి.

News January 9, 2026

ఖరీఫ్, రబీకి అనుకూలం.. APHB 126 సజ్జ రకం

image

ఏపీలోని అనంతపురం వ్యవసాయ పరిశోధనా కేంద్రం APHB 126 సజ్జ రకాన్ని అభివృద్ధి చేసింది. ఈ రకం పంట కాలం 84 నుంచి 86 రోజులు. ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేయడానికి ఇది అనుకూలమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ సజ్జరకంలో ఇనుము, జింకు అధికంగా ఉంటాయని తెలిపారు. హెక్టారుకు 30 నుంచి 33 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల దీన్ని విడుదల చేశారు.

News January 9, 2026

ప్రమాదాల నివారణకు V2V టెక్నాలజీ: గడ్కరీ

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వెహికల్ టు వెహికల్(V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీని తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ‘ప్రతి వాహనంలో దీన్ని ఏర్పాటుచేస్తాం. ఇందుకు 30MHz ఫ్రీక్వెన్సీని వాడుకునేందుకు DoT అనుమతించింది. వైర్‌లెస్ విధానంలో రోడ్లపై బ్లైండ్ స్పాట్స్, సమీప వాహనాల స్పీడ్‌ గురించి డ్రైవర్లను హెచ్చరించవచ్చు’ అని తెలిపారు.