News August 24, 2025
కొత్త మద్యం బ్రాండ్లకు CM బ్రేక్!

APలో కొత్త మద్యం బ్రాండ్ల ఎంట్రీకి బ్రేక్ పడింది. అనుమతి కోసం ఎక్సైజ్ శాఖ చేసిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు తిరస్కరించినట్లు తెలుస్తోంది. కొత్త వాటిలో చాలా వరకూ సిమిలర్ సౌండింగ్(పాత బ్రాండ్ల పేర్లకే చిన్న మార్పులు చేసి ప్రవేశపెడతారు) ఉండటంతో దీనిపై ముందుకెళ్లకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అటు ప్రస్తుతం బ్రాండ్ల ధరల సవరణ టెండర్ల అంశమూ క్యాబినెట్ ముందుకు రాగా, సిఫార్సుల ఆధారంగా ధరల్లో సవరణలుంటాయి.
Similar News
News December 29, 2025
సూపర్ నేపియర్ గడ్డితో పశువులకు కలిగే లాభమేంటి?

పచ్చి గడ్డిలో విటమిన్-A అధికంగా ఉంటుంది. సూపర్ నేపియర్ గడ్డిలో 10-12 శాతం మాంసకృత్తులు, 50-55% జీర్ణమయ్యే పదార్థాలు, 28-30 శాతం పీచుపదార్థం ఉంటుంది. ఈ గడ్డిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పశువులు ఇష్టంగా తింటాయి. దీనివల్ల పాడిపశువుల్లో ఎదుగుదల, సంతానోత్పత్తితో పాటు పాల దిగుబడి పెరుగుతుంది. సూపర్ నేపియర్ గడ్డిని తప్పనిసరిగా చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు వేయాలి.
News December 29, 2025
శివాలయంలో చండీ ప్రదక్షిణే ఎందుకు చేయాలి?

శివాలయంలో సోమసూత్రం వద్ద శివగణాధిపతి చండేశ్వరుడు ధ్యానంలో ఉంటాడు. సోమసూత్రం దాటితే ఆయన ధ్యానానికి భంగం కలుగుతుందని నమ్మకం. అలాగే శివ నిర్మాల్యం (పూలు, ప్రసాదం)పై పూర్తి అధికారం ఆయనదే. అందుకే గౌరవార్థం సోమసూత్రం దాటకుండా వెనక్కి మళ్లుతారు.
News December 29, 2025
ఇంటర్వ్యూతో ఆచార్య NG రంగా వర్సిటీలో టీచింగ్ పోస్టులు

AP: ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 8 టీచింగ్ అసోసియేట్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BSc, MSc(హోమ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్, హ్యూమన్ డెవలప్‌మెంట్ & ఫ్యామిలీ స్టడీస్, ఫుడ్ సైన్స్&న్యూట్రీషన్), PG లైబ్రరీ సైన్స్, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హతగల వారు ఇవాళ, రేపు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. వెబ్‌సైట్: angrau.ac.in


