News March 24, 2025
SLBC సహాయక చర్యలపై సీఎం కీలక ఆదేశాలు

TG: ఎస్ఎల్బీసీ సహాయక చర్యలను కొనసాగించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెస్క్యూ నిరంతర పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను నియమిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. మృతదేహాలను వీలైనంత త్వరగా వెలికి తీసేలా చూడాలన్నారు. నిపుణుల కమిటీ సూచనలతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. ఈ ఘటన జరిగి నెలరోజులు దాటగా ఏడుగురి మృతదేహాలు దొరకాల్సి ఉంది.
Similar News
News October 13, 2025
వైసీపీ నేరాలను టీడీపీపైకి నెట్టే కుట్ర: చంద్రబాబు

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో జరిగిన భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే నకిలీ మద్యం కేసూ ఉందన్నారు. అంతా వాళ్లే చేసి తమపై నింద మోపుతున్నారని చెప్పారు. క్రిమినల్ మాస్టర్ మైండ్‌కు జగన్ ఉదాహరణ అని, వైసీపీ క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వాళ్ల నేరాలను టీడీపీపై నెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
News October 13, 2025
కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై అనిల్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు పెట్టారని, లాటరీలో షాపు దక్కకపోతే ఆ డబ్బు ఎక్సైజ్ శాఖకే వెళ్తుందన్నారు. షాప్ రానివారికి రూ.3 లక్షలు తిరిగిచ్చేలా ఆ శాఖను ఆదేశించాలని, ఆ GOను కొట్టేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఎక్సైజ్ శాఖకు నోటీసులు జారీ చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
News October 13, 2025
WOW: ఇది ఎక్కడో కాదు.. మన దగ్గరే

ఫొటో చూడగానే ఏ అమెరికానో, యూరప్ కంట్రీనో అని అనుకున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఇది మన హైదరాబాద్ నగరంలో తీసిన ఫొటోనే. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో తీసిన ఈ పిక్‌ను Xలో ఓ యూజర్ పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. ఎత్తైన భవనాలు, మధ్యలో బంగారు వర్ణం మబ్బులతో కనువిందు చేస్తోంది. మీకెలా అనిపించింది? COMMENT
credits: @beforeishutup