News February 12, 2025
స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం సమీక్ష సమావేశం

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. రిజర్వేషన్లు, ఎన్నికల సన్నాహాలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, ఉత్తమ్, సీఎస్ శాంతికుమారి, కలెక్టర్లు ఇతర అధికారులకు ఆయన వివరించనున్నారు. మరోవైపు ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా నిర్వహించాలని రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించనుంది.
Similar News
News December 4, 2025
రవాణా విస్తరణ-భద్రతపై పటిష్ఠ చర్యలు తీసుకోవాలి: ఎంపీ

రాష్ట్రంలో రవాణా వ్యవస్థ విస్తరణ, రోడ్లకు నిధుల కేటాయింపు, జాతీయ రహదారులపై పెరుగుతున్న ప్రమాదాల నియంత్రణ అంశాలపై పార్లమెంటులో ఎంపీ కడియం కావ్య ప్రశ్నించారు. తెలంగాణలో రవాణా విస్తరణ-రోడ్డు భద్రతపై కేంద్రం పటిష్ఠ చర్యలు చేపట్టాలని, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు.
News December 4, 2025
SGB బొనాంజా.. గ్రాముకు రూ.9,859 లాభం

సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందిస్తున్నాయి. 2017 డిసెంబర్ 4న విడుదల చేసిన సిరీస్-X బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,961గా RBI నిర్ణయించింది. తాజాగా ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,820గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,859 లాభం(333%) వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం. ఇటీవల సిరీస్-VI బాండ్లకు ₹9,121 లాభం వచ్చిన విషయం తెలిసిందే.
News December 4, 2025
పుతిన్ పర్యటనతో భారత్కు లాభమేంటి?

* ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ మిస్సైళ్లు, డ్రోన్లను కూల్చడానికి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బాగా ఉపయోగపడ్డాయి. పుతిన్ పర్యటనలో మరిన్ని S-400లతో పాటు S-500 కొనుగోలుకు ఆమోదం లభించనుంది.
* రఫేల్, F-21, F/A-18, యూరో ఫైటర్ టైఫూన్లకు పోటీనిచ్చే Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుపైనా చర్చలు జరుగుతాయి. ఇవి రఫేల్ కంటే తక్కువ ధరకే లభించడం విశేషం.


