News November 6, 2024

వర్రా రవీంద్రను వదిలేయడంపై సీఎం సీరియస్

image

AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి 41ఏ నోటీసులిచ్చి పోలీసులు వదిలేయడంపై సీఎం చంద్రబాబు, డీజీపీ తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కడప ఎస్పీతో కర్నూలు రేంజ్ DIG సమావేశమై రవీంద్ర కేసుపై చర్చించారు. మరో కేసులో రవీంద్రాను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ వర్రాపై మంగళగిరి, HYDలో కేసులున్నాయి.

Similar News

News December 4, 2025

గోల్డ్ లోన్? పర్సనల్ లోన్? ఏది బెటర్

image

మీ దగ్గర బంగారం ఉంటే గోల్డ్ లోన్ తీసుకోవడం గుడ్ ఛాయిస్. అత్యవసరంగా డబ్బులు అవసరమైతే బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. తనఖా పెట్టిన కొద్దిసేపటికే డబ్బులు అకౌంట్‌లో డిపాజిట్ అవుతాయి. నెల నెలా వడ్డీ కట్టే సమస్య ఉండదు. సంవత్సరం చివరిలో లేదంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చెల్లించి మీ బంగారం వెనక్కి తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ EMI చెల్లింపు మిస్ అయితే వడ్డీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.

News December 4, 2025

రష్యాకు ఫుడ్.. మనకు ఆయిల్!

image

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ముడిచమురు దిగుమతిదారు భారత్. ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశం నుంచి ఆయిల్‌ను IND అతితక్కువ ధరకే కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు పుతిన్ పర్యటనలో ఒప్పందం కుదరనుంది. ‘ఫుడ్ ఫర్ ఆయిల్’ డీల్‌ $60 బిలియన్లకు పెరగనుంది. దీని ప్రకారం భారత్ వ్యవసాయ ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేస్తే.. ఆ దేశం ఆయిల్‌ను పంపనుంది.

News December 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 86 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: పార్వతీ దేవి అవతారంగా, శక్తి స్వరూపిణిగా, విష్ణుమూర్తి సోదరిగా పరిగణించబడే, ఈశ్వరుడు వివాహం చేసుకున్న దేవత ఎవరు? అలాగే, ఆమెకు తమిళనాడులో ఒక ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. ఆమెతో పాటు ఒక పచ్చ చిలుక కూడా కనిపిస్తుంది.
సమాధానం: మధుర మీనాక్షి అమ్మవారు. ఈ దేవత ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని మధురలో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>