News April 30, 2024

రేపు బొబ్బిలిలో సీఎం జగన్.. మండపేటలో పవన్ సభలు

image

AP: సీఎం జగన్ రేపు మూడు చోట్ల మేమంతా సిద్ధం బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఉదయం 10గంటలకు బొబ్బిలిలో, ఆ తర్వాత పాయకరావుపేట, ఏలూరు సభల్లో ప్రసంగిస్తారు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో వారాహి సభలో పాల్గొంటారు.

Similar News

News January 30, 2026

నవగ్రహాలు – నవరత్నాలు: ఏ గ్రహానికి ఏ రత్నం?

image

ఆదిత్యుడు – కెంపు
చంద్రుడు – ముత్యం
అంగారకుడు – ఎర్రని పగడం
బుధుడు – పచ్చ
గురు – పుష్య రాగం
శుక్రుడు – వజ్రం
శని – నీలం
రాహువు – గోమేధుకం
కేతువు – వైడూర్యం

News January 30, 2026

రాజీకి ఏ విధానం అనుసరించారు: హైకోర్టు

image

AP: పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని TTD EOను HC ఆదేశించింది. రాజీకి అథారిటీ ఎవరు? ఏ విధానం అనుసరించారు? టీటీడీ నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని తెలిపింది. సింగిల్‌ జడ్జి ఆదేశాలపై వచ్చిన అప్పీల్‌తో పాటు సుమోటో పిటిషన్‌ను కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం విచారించింది. కేసును Feb 5కు వాయిదా వేసింది.

News January 30, 2026

పీటీ ఉష భర్త కన్నుమూత

image

భారత దిగ్గజ అథ్లెట్, రాజ్యసభ MP PT ఉష భర్త శ్రీనివాసన్(64) కన్నుమూశారు. కేరళ థిక్కోడి పెరుమాళ్‌పురంలోని నివాసంలో ఈ తెల్లవారుజామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ తుదిశ్వాస విడిచారు. ఘటన జరిగినప్పుడు ఉష ఇంట్లో లేరు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్నారు. విషయం తెలియగానే ఆమె బయల్దేరారు. శ్రీనివాసన్ మృతిపట్ల PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.