News March 17, 2024
కోనసీమ గడ్డ నుంచి సీఎం జగన్ ప్రచారం.. 19న సభ

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తొలిసారిగా కోనసీమ గడ్డ నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 19వ తేదీన కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో నిర్వహించనున్న వైసీపీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. స్థానిక ఆకుల వీర్రాజు విగ్రహం వద్ద మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సభ జరగనుందని కొత్తపేట MLA, వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు.
Similar News
News September 17, 2025
కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతి వేడుకలు

విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా విశ్వకర్మ జయంతి వేడుకలు జరిగాయని కలెక్టర్ తెలిపారు.
News September 16, 2025
మంత్రి కందులను కలిసిన కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి మంత్రి కందుల దుర్గేశ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన రాజమండ్రికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రాంతమని, దానిని మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కలెక్టర్కు సూచించారు.
News September 15, 2025
తూ.గో పోలీస్ గ్రీవెన్స్కు 40 అర్జీలు

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”లో 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మురళీకృష్ణ అర్జీలు స్వీకరించారు. అక్కడికక్కడే సంబంధిత పొలీసు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానకి కృషి చేశారు. అర్జీలలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులు ఉన్నాయన్నారు.