News May 10, 2024

రేపు పిఠాపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ముగింపు

image

AP: సీఎం జగన్ రేపు 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు చిలకలూరిపేట, మ.2 గంటలకు కైకలూరులో నిర్వహించే బహిరంగసభల్లో ప్రసంగిస్తారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురంలో వైసీపీ నుంచి బరిలో ఉన్న వంగా గీత తరఫున మధ్యాహ్నం 4 గంటలకు CM ప్రచారం చేయనున్నారు. అక్కడితో ఎన్నికల ప్రచారానికి ఆయన ముగింపు పలకనున్నారు.

Similar News

News January 8, 2025

చాహల్ భార్యతో సన్నిహిత ఫొటో: స్పందించిన కొరియోగ్రాఫర్

image

టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధనశ్రీతో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్‌ సన్నిహితంగా దిగిన ఫొటో SMలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతీక్ స్పందించారు. ‘ఎవరికైనా తమకు నచ్చిన కథలు, కథనాలు చెప్పుకునే స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఉంది. కానీ ఒక చిన్న ఫొటోను వేరేవిధంగా చూడడం దారుణం. అబ్బాయిలూ ఎదగండి’ అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

News January 8, 2025

టెస్టుల్లో మళ్లీ విరాట్ కెప్టెన్ కావొచ్చు: గిల్‌క్రిస్ట్

image

విరాట్ కోహ్లీ మరోసారి ఇండియా టెస్టు జట్టు పగ్గాలు చేపట్టొచ్చని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గిల్‌క్రిస్ట్ అన్నారు. ‘రోహిత్ ఇంటికి చేరాక టెస్టు భవిష్యత్తును సమీక్షించుకుంటారు. ఆయన ఇంగ్లండ్‌ టెస్టులకు వెళ్తారని నేను అనుకోవడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడొచ్చేమో. ఆ తర్వాత రిటైరవ్వొచ్చు. బుమ్రా ఎంత ఫిట్‌గా ఉన్నారన్నది అనుమానమే. నాకు తెలిసి భారత్ మళ్లీ విరాట్‌నే కెప్టెన్‌గా నియమించొచ్చు’ అని వ్యాఖ్యానించారు.

News January 8, 2025

విశాఖ ఫిషింగ్ హార్బర్‌ను అభివృద్ధి చేస్తాం: మోదీ

image

AP: విశాఖ సముద్ర తీరం వందల ఏళ్లుగా ఎగుమతులు, దిగుమతుల్లో ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. స్థానిక ఫిషింగ్ హార్బర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సముద్ర సంబంధిత అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటామని, మత్స్యకారుల ఆదాయం పెరిగేలా నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. అటు చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో క్రిస్ సిటీ(కృష్ణపట్నం) భాగం అవుతుందని వెల్లడించారు.