News April 6, 2024
కావలిలో నేడు సీఎం జగన్ బహిరంగ సభ

AP: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేడు నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఉదయం 9గంటలకు చింతరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. కొవ్వూరు క్రాస్, గౌరవరం మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు అక్కడ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్రోడ్, ఓగూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.
Similar News
News November 5, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

కార్తీక పౌర్ణమి వేళ బంగారం ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.980 తగ్గి రూ.1,21,480కు చేరింది. 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.900 పతనమై రూ.1,11,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ. 2,000 తగ్గి రూ. 1,63,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 5, 2025
భార్యకు చిత్రహింసలు.. 86 ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష

ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన వృద్ధాప్యంలో ఓ వ్యక్తి భార్యపై క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. బంధువులను కలవనీయకుండా శారీరకంగా, మానసికంగా హింసిస్తూ అవమానించాడు. బాధలను తట్టుకోలేని ఆమె కోర్టుకు వెళ్లింది. దీంతో 86ఏళ్ల ధనశీలన్కు 6 నెలల జైలు శిక్ష, ₹5K ఫైన్ విధించింది. దీనిపై మరోకోర్టు స్టే విధించగా, శిక్ష కరెక్టేనని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది. వివాహం అంటే బాధలను భరించడం కాదని చెప్పింది.
News November 5, 2025
నేడు గిరి ప్రదక్షిణ చేస్తే..?

అరుణాచలంలోని అన్నామలై కొండను శివలింగంగా భావించి చేసే ప్రదక్షిణనే ‘గిరి ప్రదక్షిణ’ అంటారు. అయితే ఈ ప్రదక్షిణను కార్తీక పౌర్ణమి రోజున చేయడం వల్ల మరింత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. 14KM ఉండే ఈ గిరి చుట్టూ చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరి, ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పున్నమి వెలుగులో ప్రదక్షిణ చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు.


