News August 1, 2024
స్కిల్ యూనివర్సిటీకి నేడు సీఎం శంకుస్థాపన
TG: రంగారెడ్డి(D) మీర్ఖాన్పేటలో CM రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. నెట్ జీరో సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు రైతులకు ప్లాట్లు కేటాయించనున్న లేఅవుట్లో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాల్ భవనాల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేయనున్నారు. అనంతరం సా.4 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.
Similar News
News February 2, 2025
అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారు: KTR
TG: ఆకలి చావులు, ఆత్మహత్యల తెలంగాణను KCR తన పదేళ్ల పాలనతో దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారని KTR అన్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ నాయకులు అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు, ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్న వార్తలను Xలో పోస్ట్ చేశారు. ‘ఇది ప్రజాపాలన కాదు. ప్రజలను వేధించే పాలన. జాగో తెలంగాణ జాగో’ అని పేర్కొన్నారు.
News February 2, 2025
90sలో మేం తీసుకున్న పెద్ద నిర్ణయం అదే: సచిన్
విలువలు పాటించే విషయంలో తనకు తన కుటుంబం ఎంతో మద్దతునిచ్చిందని సచిన్ టెండూల్కర్ చెప్పారు. నమన్ అవార్డ్స్ ఈవెంట్లో మాట్లాడుతూ ’90వ దశకం మధ్యలో రెండేళ్లు నేను బ్యాట్ కాంట్రాక్టు లేకుండా ఆడాను. ఆ సమయంలో ఆల్కహాల్, టొబాకో కంపెనీలు తమ ప్రచారం కోసం బ్యాట్లను మాధ్యమంగా వాడుకున్నాయి. అందుకే వాటిని ప్రోత్సహించొద్దని మా ఇంట్లో డిసైడ్ అయ్యాం. 90sలో మేం తీసుకున్న పెద్ద నిర్ణయం అదే’ అని వెల్లడించారు.
News February 2, 2025
GBS కలకలం.. పెరుగుతున్న మరణాలు
మహారాష్ట్రలో గిలియన్ బార్ సిండ్రోమ్తో మరో మరణం సంభవించింది. నాందేడ్లో 60 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఆ రాష్ట్రంలో GBS మరణాల సంఖ్య 5కు పెరిగింది. మరోవైపు పుణేలో కేసుల సంఖ్య 149కి చేరింది. తాజాగా అస్సాంలో తొలి GBS మరణం నమోదైంది. ఇటీవల తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన <<15316737>>ఓ మహిళ<<>> ఈ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.