News September 12, 2025
అమరావతికి బయల్దేరిన సీఎం.. కాసేపట్లో Way2News కాన్‌క్లేవ్‌కు..

AP: ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి బయల్దేరారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమరావతికి చేరుకుంటారు. అక్కడి నుంచి CK కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న Way2News కాన్‌క్లేవ్‌కు హాజరుకానున్నారు. రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి అంశాల చర్చావేదికలో పాల్గొంటారు.
Similar News
News March 12, 2026
కొవిడ్ టీకాతో మరణాలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

కొవిడ్ టీకా తర్వాత కొన్ని మరణాలు, తీవ్రమైన అనారోగ్యం సంభవించినట్లు GOVT డేటాలో వెల్లడైందని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాంటప్పుడు బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని స్పష్టం చేసింది. వారి కోసం నో ఫాల్ట్ కాంపెన్సేషన్ పాలసీ(నష్టం/ప్రమాదం ఎవరి వల్ల జరిగిందో నిరూపించాల్సిన అవసరం లేకుండా పరిహారం ఇవ్వడం)ని రూపొందించాలని ఆదేశించింది. రచన గంగు వేసిన కేసులో ఈ మేరకు తీర్పునిచ్చింది.
News March 12, 2026
GOOD NEWS: వారికి 15 రోజుల సెలవులు

AP: GOVT ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రిటైర్మెంట్‌కు రెండేళ్ల ముందు దాదాపు 50వేల మందికి 15 రోజులు వెల్‌నెస్ లీవ్ ఇవ్వనున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. అలాగే రూ.50వేల వరకు హెల్త్ బెనిఫిట్స్ అందజేస్తామని తెలిపారు. సెలవుల్లో టెస్టులు చేయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు.
News March 12, 2026
చైనాకు 1.2 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు?

హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే చమురు నౌకలపై దాడి చేస్తామని బెదిరిస్తున్న ఇరాన్.. ఆ మార్గం ద్వారా వెళ్లే తన షిప్‌మెంట్స్‌ను మాత్రం ఆపలేదని తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి తమ ప్రధాన ఇంపోర్టర్ అయిన చైనాకు దాదాపు 1.2 కోట్ల బ్యారెళ్ల చమురు పంపినట్లు సమాచారం. అమెరికా/ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచడం కోసం హార్ముజ్‌ను ఆయుధంగా వాడుకుంటున్న ఇరాన్ వల్ల భారత్ సహా అనేక దేశాల చమురు నౌకలు ఆగిపోయాయి.


