News July 29, 2024

ప్రమోటెడ్ టీచర్లతో ఆగస్టు 2న సీఎం సమావేశం

image

TG: ఇటీవల ప్రమోషన్లు పొందిన దాదాపు 30వేల మంది టీచర్లతో సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 2న సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 3గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు నేరుగా సీఎంతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Similar News

News January 11, 2026

APPLY NOW: NABARDలో 44 పోస్టులు

image

<>NABARD<<>>లో 44 కాంట్రాక్ట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE, B.Tech, PG, B.Ed, BBA, డిగ్రీ (డిజిటల్ మీడియా, మల్టీ మీడియా, గ్రాఫిక్ డిజైన్, అగ్రికల్చర్, సాయిల్ సైన్స్, హార్టికల్చర్) ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల వయసు 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nabard.org/

News January 11, 2026

‘రాజాసాబ్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

image

‘రాజాసాబ్’ సినిమా భారత్‌లో రెండు రోజుల్లో ₹108.4కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు Sacnilk వెబ్‌సైట్ పేర్కొంది. ప్రీమియర్లకు ₹11.3Cr, తొలి రోజు ₹64.3Cr, రెండో రోజు ₹32.84Cr కలెక్షన్స్ వచ్చినట్లు వెల్లడించింది. హిందీలో 2 రోజుల్లో ₹11.2Cr రాబట్టినట్లు తెలిపింది. కాగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ₹112Cr+ గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ టీమ్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.

News January 11, 2026

ఆవు పాలకు ఉన్న ప్రత్యేకతలు ఇవే..

image

ఆవు పాలలో కొవ్వు శాతం గేదె పాల కంటే తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి సులువుగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే ప్రోటీన్స్ కండరాలను బలోపేతం చేస్తాయి. ఆవు పాలలో అధిక కాల్షియం, విటమిన్ డి ఎముకలు, దంతాలను బలపరుస్తాయి. శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. గుండె జబ్బులు ఉన్నా, బాగా లావుగా ఉన్నా, జీర్ణ సమస్యలు ఉంటే ఆవు పాలను తాగడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులకు ఆవు పాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.