News March 30, 2025

గవర్నర్‌తో సీఎం భేటీ.. మంత్రివర్గ విస్తరణపైనే చర్చ?

image

TG: హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ మర్వాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయనకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు గంట సేపు జరిగిన సమావేశంలో మంత్రి వర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం. ఏప్రిల్ 3న కొత్త మంత్రులతో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉంది.

Similar News

News November 13, 2025

కంపెనీల అనుమతుల్లో జాప్యం ఉండదు.. చంద్రబాబు స్పష్టం

image

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని CM CBN స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన ఇండియా-యూరప్ బిజినెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్‌ విధానంలో ముందుకెళ్తున్నామని, కంపెనీల అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని తేల్చి చెప్పారు. త్వరలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి రానున్నాయని వివరించారు.

News November 13, 2025

‘ఉగ్ర’వర్సిటీ.. పేలుళ్లకు పథక రచన అక్కడే!

image

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో ఫరీదాబాద్‌ అల్ ఫలాహ్ వర్సిటీ వార్తల్లో నిలిచింది. దేశంలో కల్లోలం సృష్టించేందుకు ఇక్కడి నుంచే డా.ఉమర్ నబీ, ముజమ్మిల్ పథకం రచించారు. వీరు డాక్టర్లు షాహీన్, ఆదిల్‌తో సంప్రదింపులు జరిపారు. 4 నగరాల్లో పేలుళ్లు జరపాలనుకున్నారు. కానీ ఫండ్ రైజ్ డబ్బుల విషయంలో ఉమర్, ముజమ్మిల్‌ మధ్య విభేదాలు రావడంతో ప్లాన్ ప్రకారం వారు అనుకున్నట్లు జరగలేదు. లేదంటే మరింత మంది బలయ్యేవారేమో!

News November 13, 2025

తెలంగాణలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం

image

దేశీయ మంచి నీటి చేపలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం తెలంగాణలోని రంగారెడ్డి(D) కోహెడలో 13ఎకరాలను ఎంపిక చేసింది. దీని ఏర్పాటుకు రూ.47 కోట్లను మంజూరు చేసింది. దేశంలోని జలాశయాలు, డ్యాములు, చెరువులు, కుంటల్లో చేపలను దేశవిదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.