News October 18, 2025
ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ.. దీపావళి కానుక ప్రకటిస్తారా?

AP: మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా సీఎం వారితో చర్చిస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వం ఏదైనా కానుక అందిస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. దీనిపై కాసేపట్లో సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.
Similar News
News October 18, 2025
CPS అంశాన్ని త్వరలో పరిష్కరిస్తాం: సీఎం

AP: *ఈ దీపావళి లోపు RTC ఉద్యోగుల ప్రమోషన్లు క్లియర్ చేస్తాం
*180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు
*పోలీసులకు EL’s కింద NOVలో రూ.105 కోట్లు, జనవరిలో రూ.105 కోట్లు ఇస్తాం
*నాలుగో తరగతి ఉద్యోగుల గౌరవాన్ని పెంచేలా రీ డెసిగ్నేట్
*CPS అంశంపై చర్చించి త్వరలో పరిష్కరిస్తాం
*ఉద్యోగ సంఘాల భవనాల ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తాం
News October 18, 2025
DA బకాయిలు రూ.7వేల కోట్లు: సీఎం

AP: గత ప్రభుత్వం డీఏలను పెండింగ్‌లో పెట్టిందని, ఇప్పుడు రూ.7వేల కోట్ల బకాయిలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇతర రాష్ట్రాలు మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్)పై ఎక్కువ ఖర్చు చేస్తే, ఏపీలో గత ప్రభుత్వం DBTకి పెద్దపీట వేసిందని విమర్శించారు. వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
News October 18, 2025
7 వికెట్లతో సత్తా చాటిన షమీ

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన టీమ్ ఇండియా స్టార్ పేసర్ షమీ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నారు. ఉత్తరాఖండ్‌తో జరిగిన తొలి మ్యాచులో 7 వికెట్లు తీసి సత్తా చాటారు. దీంతో బెంగాల్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఫిట్‌నెస్ కారణంగా AUSతో సిరీస్‌కు షమీని దూరం పెట్టినట్లు సెలక్టర్లు ప్రకటించడం, ఆ వ్యాఖ్యలపై షమీ ఫైరవడం తెలిసిందే.