News September 2, 2025

మారిటైమ్ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ

image

AP: విశాఖపట్నంలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మారీటైమ్ రంగంలోని బ్లర్గ్స్ ఏఐ, డాకర్ విజన్, ఓల్టియో మారిటైమ్, ఆటోమాక్సిస్, ఈజీ లేన్, ఎయిమ్ లొకేట్ తదితర స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. పలు కంపెనీల సీీఈవోలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

Similar News

News September 2, 2025

ఆ ప్రచారంతో ఆరు నెలలు ఆఫర్లు రాలేదు: అనుపమ

image

‘రంగస్థలం’ సినిమా ఆఫర్ వదులుకున్నానని తనపై తప్పుడు ప్రచారం జరిగిందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. రామ్ చరణ్ సినిమాను రిజెక్ట్ చేశారనే ప్రచారంతో తాను ఆఫర్లు లేకుండా 6 నెలలు ఖాళీగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘రంగస్థలంలో నటించాలని సుకుమార్ అడిగారు. నేను అందుకు సిద్ధమయ్యాను. అదే సమయంలో వారు వేరే హీరోయిన్‌ను నా స్థానంలో తీసుకున్నారు’ అని చెప్పారు. ఈ మూవీలో సమంత నటించిన సంగతి తెలిసిిందే.

News September 2, 2025

రాజకీయ పార్టీ నడిపిన తెలుగు వనితలు వీరే

image

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రేణుకా చౌదరి-టీడీపీ-2(1994), లక్ష్మీ పార్వతి-ఎన్టీఆర్ టీడీపీ(1996), విజయశాంతి-తల్లి తెలంగాణ(2005), కొత్తపల్లి గీత-జన జాగృతి(2018), వైఎస్ షర్మిల-వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(2021) స్థాపించారు. కానీ టీడీపీ-2, ఎన్టీఆర్ టీడీపీ తర్వాతి కాలంలో రద్దు కాగా, మిగతా పార్టీలు ఇతర పార్టీల్లో విలీనమయ్యాయి.

News September 2, 2025

ఇంగ్లండ్ బౌలర్ బేకర్ చెత్త రికార్డు

image

ఇంగ్లండ్ బౌలర్ సోనీ బేకర్ అరంగేట్ర మ్యాచులోనే చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో బేకర్ 7 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 76 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో డెబ్యూట్ మ్యాచులో అత్యధిక పరుగులు ఇచ్చిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా ఆయన నిలిచారు. అటు బ్యాటింగ్‌లోనూ బేకర్ తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. ఈ మ్యాచులో ఇంగ్లండ్‌ను సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.