News October 15, 2024
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో 18న సీఎం భేటీ

AP: టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఈ నెల 18న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. మార్చిలో జరిగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. మద్యం, ఇసుక వ్యవహారాల్లో అధికార పార్టీ నేతల జోక్యంపై విమర్శలు వస్తుండటంపై వివరణ తీసుకుంటారని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల కేటాయింపుపైనా చర్చిస్తారని, ప్రభుత్వ పనితీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారని సమాచారం.
Similar News
News December 8, 2025
2026 DECకు పూర్తి కానున్న విశాఖ-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే

విశాఖపట్నం-రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) ఎక్స్‌ప్రెస్‌వే పనులు 2026 చివరి నాటికి పూర్తి కానున్నాయి. రూ.16,482 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆర్థిక కారిడార్‌ను కేంద్రం చేపట్టింది. మొత్తం 597 KM మార్గాన్ని 465KMకి తగ్గిస్తూ 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేగా నిర్మిస్తోంది. దీంతో AP, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మధ్య ప్రయాణ సమయం దాదాపు 7 గంటలు తగ్గుతుంది. టూరిజం, పారిశ్రామిక రవాణా, వ్యాపార అవకాశాలకు పెద్ద ఊతం లభించనుంది.
News December 8, 2025
పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల ఉత్పత్తికి అవసరమయ్యే ఆక్సిటోసిన్ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో అధిక వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.
News December 8, 2025
ఇవాళ్టి మ్యాచులకు నో ఎంట్రీ!

HYDలోని ఉప్పల్, జింఖానా మైదానాల్లో SMATలో భాగంగా ఇవాళ 4 మ్యాచులు జరగనున్నాయి. అయితే ప్రేక్షకులను అనుమతించకూడదని HCA నిర్ణయించింది. DEC 2న పంజాబ్, బరోడా మధ్య మ్యాచ్ జరగ్గా హార్దిక్, అభిషేక్‌ను చూడటానికి భారీగా ఫ్యాన్స్ వచ్చారు. సరైన సెక్యూరిటీ లేక పలువురు గ్రౌండులోకి వెళ్లి ప్లేయర్లతో సెల్ఫీలు సైతం దిగారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత దృష్యా ఆడియన్స్‌ను అనుమతించకూడదని నిర్ణయించినట్లు HCA తెలిపింది.


