News March 18, 2024
నేడు వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లతో సీఎం భేటీ

AP: ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో సీఎం జగన్ ఇవాళ వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఈ భేటీ జరగనుంది. జిల్లాలవారీగా పరిస్థితులు, మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం చర్చించనున్నారు. కాగా త్వరలోనే 175 MLA, 25 MP అభ్యర్థులతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం.
Similar News
News March 28, 2025
తెలుగువారే అగ్రస్థానంలో ఉండాలి: CM చంద్రబాబు

AP: భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని, వారిలోనూ తెలుగువారు ముందుండాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘తెలుగువారు దూసుకెళ్లాలనేది నా స్వార్థం. దీని కోసం అమరావతిలో క్వాంటమ్ వాలీని ప్లాన్ చేస్తున్నాం. అందులోనే అన్ని సాంకేతికతల్ని ఏర్పాటు చేస్తాం. భారత ప్రభుత్వంతో పాటు ఐఐటీ మద్రాస్, ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీతో కలిసి పనిచేస్తున్నాం. ఇలాంటిది తీసుకురావడం దేశంలోనే తొలిసారి’ అని వెల్లడించారు.
News March 28, 2025
బిల్ గేట్స్ నాతో మాట్లాడనన్నారు: CM చంద్రబాబు

AP: తాను కలుస్తానని మొదటిసారి కోరినప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇష్టపడలేదని CM చంద్రబాబు ‘మద్రాస్ IIT’ ప్రసంగంలో తెలిపారు. ‘రాజకీయ నాయకులతో తనకు పని లేదని ఆయన అన్నారు. ఒప్పించి 45 నిమిషాలు మాట్లాడాను. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను. మనమంతా కృషి చేస్తే భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుంది. 2027 నాటికి మూడోస్థానం, 2047 నాటికి అగ్రదేశంగా అవతరిస్తుంది’ అని తెలిపారు.
News March 28, 2025
వేడికి ఆగలేం.. కానీ చెట్లను బతకనీయం!

వేసవి వేడి మొదలైంది. బయటితో పోలిస్తే చెట్టు నీడలో ఉష్ణోగ్రత సగటున కనీసం 2 డిగ్రీలు తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ పల్లెటూళ్లలో సైతం ఇంటి ముందు ఖాళీ ఉంటే సిమెంట్తో అలికేస్తున్నాం తప్పితే చెట్లను ఎంతమంది పెంచుతున్నాం? ఆకులు రాలతాయనో, వేర్లు ఇంటిని కూల్చేస్తాయనో చాలామందిలో ఆందోళన. కనీసం ఖాళీ స్థలాల్లోనైనా వీలైనన్ని చెట్లు నాటితే భూతాపాన్ని తగ్గించినవారిమవుతాం. వృక్షో రక్షతి రక్షిత: